జనసేనాని పై విమర్శలు చేస్తే.. ప్రతివిమర్శలు చూస్తారు: జనసేన హెచ్చరిక

*సీబీఐ దత్తపుత్రుడు – జైల్ రెడ్డి అలియాస్ (జగన్ రెడ్డి) వ్యక్తిగత దూషణలు మీకే చేటు.. కిరణ్ రాయల్

చిత్తూరు: తమ అధినేత పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడని, సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రస్తావిస్తే జగన్ గుట్టును బయట పెడతామని… జనసేన పార్టీ తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్ హెచ్చరించారు..

శనివారం ప్రెస్ క్లబ్ లో మీడియా మధ్య జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రాజారెడ్డి, బత్తిన మధుబాబు, రాజేష్ యాదవ్, హేమ కుమార్, సుమన్ బాబు, మున స్వామి, పూల ప్రభాకర్, హరి నాయక్, ఈశ్వర్ రాయల్, తదితరులతో కలిసి కిరణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా ఏ వన్ నిందితుడిగా (సీబీఐకి దత్త పుత్రుడు) జైల్ రెడ్డి కి తమ పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత లేదన్నారు..

తమ జనసేనాని ప్రజలకు దత్తపుత్రుడని.. ఇంకొక పార్టీకి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేత ఆత్మహత్య చేసుకున్న కవులు రైతులను ఆదుకుంటూ రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా 30 కోట్లు సహాయం అందిస్తూ… రాష్ట్రంలో తిరుగుతుంటే, పాలక వైసిపి విమర్శించడం హేయమైన చర్య అని.. అవినీతి చక్రవర్తి (జైలుపక్షి) జగన్ మరో దేశానికి పోవాలంటే (సిబిఐ పర్మిషన్) తీసుకోవాలని అలాంటిది.. జగన్ తమ పవన్ ను విమర్శించడం ఏంటని ప్రశ్నించారు.

ఈ నెల (మే) 11 నుంచి గడప గడపకి వైసిపి ప్రజాప్రతినిధులు వస్తున్నారని ప్రచారం చేశారు కాని.. ఓపది మంది (ఎమ్మెల్యేలు) ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక పారిపోయారని ఎద్దేవా చేశారు..

కొందరైతే సాకులు చెప్పుకుంటూ వాయిదా వేసుకున్నారని, నిజానికి గడపలో
పెట్టడానికి (జనాగ్రహానికి బలై పోతామేమోనని) భయపడ్డారు. తమ పార్టీ ఎత్తులు, పొత్తులు భవిష్యత్తు నిర్ణయిస్తుందన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చి జనసేన పార్టీ పాలన కూడ ప్రజలు చూడాలని ఆయన కోరారు. మరోసారి జనసేనను విమర్శిస్తూ మాట్లాడితే, ప్రతి దాడికి తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.