కౌలు రైతులు కాదని దమ్ముంటే… నిరూపించండి: కందుల సవాల్

ఉమ్మడి పశ్చిమగోదావరి గణపవరంలో సిఎం జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్. జనసేన పవన్ కళ్యాణ్ చేపట్టిన జనసేన రైతు భరోసా యాత్ర చూసి సిఎం జగన్ తన అక్కసు వెళ్ళగక్కుతున్నారు. పోలీసుల ఎఫ్ఐఆర్ లో ఉన్న కౌలు రైతుల కుటుంబాలకే ఇంతవరకూ 200 మందికి లక్ష వంతున జనసేన సాయం అందించింది. ఆ కుటుంబాలు కౌలు రైతులు కాదని దమ్ముంటే… నిరూపించండి. 3వేల మంది కౌలు రైతులు చనిపోతే పవన్ కళ్యాణ్ యాత్ర చేపట్టాకే 31 మందికి జీవో ప్రకారం ప్రభుత్వం పరిహారం ఇచ్చింది. రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులతో చనిపోయిన 3వేల కౌలురైతు కుటుంబాలను పవన్ కళ్యాణ్ ఆదుకుంటారు. తూర్పుగోదావరిలో చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు జూన్ మొదటివారంలో పరిహారం అందించే కార్యక్రమం చేపడతాం. కౌలు రైతులు అసలు ఆత్మహత్యలు చేసుకోలేదని సిఎం జగన్ ఎలా చెబుతారని ప్రశ్నించిన కందుల. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తున్న మీరు రైతు భరోసా గురించి మాట్లాడతారా..? రైతులను కులాలుగా విభజించి అగ్రవర్ణాల రైతులకు భరోసా ఇవ్వరా…? పవన్ చేపట్టిన రైతు భరోసా యాత్రపై అక్కసుతోనే దత్తపుత్రుడని పదేపదే మాట్లాడుతున్నారు. మీరు జైలు పక్షి, సిబిఐ దత్తపుత్రుడుగా సాక్ష్యం ఉంది. దత్రపుత్రుడని పవన్ పై చేస్తున్న విమర్శ చేయడానికి అర్హతలేదు. పవన్ కళ్యాణ్ తన కష్టార్జితాన్ని కౌలు రైతుల కుటుంబాలకు అందిస్తున్నారు. మూడు వేల మంది కౌలు రైతులకూ పవన్ కళ్యాణ్ 30 కోట్ల మేర ఆర్ధికసాయం అందిస్తారని జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ అన్నారు.