జనసేన నాయకులపై పెట్టిన అక్రమ కేసులను భేషరతుగా ఉపసమ్హరించుకోవాలి: నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూరు, విశాఖపట్నంలో జనసేన నాయకులపై పెట్టిన అక్రమ కేసులను భేషరతుగా ప్రభుత్వం ఉపసంహరించు కోవాలని ఆత్మకూరు జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. విశాఖపట్నంలో జనసేన నాయకులను అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నందుకు నిరసనగా, ఆత్మకూరు జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ పూజ్యులు, మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం మన రాష్ట్రంలో అభాసు పాలు అయింది అన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో, ప్రతిపక్షానికి అంతకు రెట్టింపు బాధ్యత ఉంటుంది. అధికార పక్షం చేస్తున్న అన్యాయాలను, అరాచకాలను ప్రజల పక్షాన నిలబడి గళమెత్తవలసిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతుక నొక్కివేసే ప్రయత్నం జరుగుతుంది. అన్యాయాల గురించి ప్రశ్నిస్తే దాడులు చేస్తారు, అక్రమాల గురించి గళం ఎత్తితే అక్రమ కేసులు బనాయిస్తారు. ఈ ప్రభుత్వ విధానంలో భాగమే, నిన్న విశాఖపట్నంలో జనసేన పార్టీ నిర్వహించ తలపెట్టిన జనవాణి కార్యక్రమానికి అడ్డంకులు, అక్రమ అరెస్టులు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా అధికార పక్షానికి వంత పాడుతూ, తీవ్ర విమర్శలను ఎదుర్కొంటూ అభాసుపాలయింది‌‌. అధికారపక్షానికి ఒక రూలు, ప్రతిపక్షాలకు ఒక రూలుగా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తుంది. ఈ వివక్షలో భాగమే ఏ.ఎస్.పేట మండలం పెద్ద అబ్బీపురంలో జరిగిన మామిడి చెట్ల నరికివేత సంఘటన. మామిడి చెట్లను నరికివేసిన నిందితులను రెండు నెలలైనా అరెస్టు చేయని పోలీసులు, మామిడి చెట్లను నరికివేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని అమరణ నిరాహార దీక్ష చేపట్టిన జనసేన పార్టీ నాయకులను కేవలం రెండు రోజుల్లో 30 మంది పోలీస్ బెటాలియన్ తో, అరెస్టు చేయడం జరిగింది. అంటే నిందితులకు పోలీసులు నిస్సిగ్గుగా కొమ్ముకాస్తున్నారు మరియు న్యాయం కోసం గళమెత్తిన బాధితులను, బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న జనసేన పార్టీ నాయకులను వేధిస్తున్నారు. ఈ వివక్షాపూరితమైన పోలీసు అధికారుల ప్రవర్తన, మొత్తం పోలీస్ వ్యవస్థనే అబాసుపాలు చేస్తుంది. బాధితుల తరఫున నిలబడి పోరాడుతున్న ఆత్మకూరు జనసైనికుల గొంతుక నొక్కేయాలని చూస్తున్నా, రెట్టించిన ఉత్సాహంతో ధైర్యంగా పోరాడుతామే తప్పించి, వెనకడుగు వేయమని ఈ సందర్భంగా ఆత్మకూరు జనసేన పార్టీ తరఫున శ్రీధర్ పేర్కొన్నారు. అదేవిధంగా విశాఖపట్నంలో జనసేన నాయకులపై బనాయించిన అక్రమ కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాని ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో చంద్ర, సురేష్, నాగరాజు, వెంకటరమణ, అనిల్, ప్రసాద్, వినోద్, హజరత్ తదితరులు పాల్గొన్నారు.