గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన

నెల్లూరు: రాజకీయాల్లో మార్పు కోసం యువత ఓటు నమోదు చేసుకొని వినియోగించుకోవాలని, నవ సమాజ నిర్మాణానికి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ చాకలి వీధి నందు గల రత్నం కాలేజీ వద్ద ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అనే కార్డులు ప్రదర్శించి పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి తమ మద్దతుని యువత తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి సాధించి అభివృద్ధి పథంలో నడవాలంటే పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కళ్యాణ్ గారి నిర్ణయం ఏదైనా కూడా వారి నిర్ణయాన్ని అనుసరించి నడిచే దానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారు. రేపటి తరం యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఉంది. 18 సంవత్సరాల నిండిన విద్యార్థిని విద్యార్థులు బాధ్యతగా ఓటు నమోదు చేయించుకుని రేపు జరగనున్న ఎన్నికల లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. జవాబుదారీ గల ప్రభుత్వాన్ని నిర్మించేందుకు మీరందరూ కూడా సహకరించాలి. రేపటి యువత భవిత బాగుండాలన్నా, ఉద్యోగ అవకాశాలు మెండుగా రావాలన్నా, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా ప్రజా ప్రభుత్వంకే అవకాశం ఇచ్చి జనసేన పార్టీ ని గెలిపించాలి అనికోరారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషన్, జిల్లా వీరమహిళా కన్వీనర్ కోలా విజయలక్ష్మి, రేణుక, బన్నీ, వర, తరుణ్, ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, కార్తీక్, శ్రీను, కేశవులు తదితరులు పాల్గొన్నారు.