జనగన్న కాలనీలో అక్రమ నిర్మాణాలను తొలగించాలి: బాబు పాలూరు

బొబ్బిలి నియోజకవర్గం: రామభద్రపురం మండల కేంద్రానికి కేటాయించిన చింతలవలస జనగన్న కాలనీలో అక్రమ కట్టడాలను తొలగించాలని మరియు నిజమైన లబ్దిదారులకు పట్టాలు ఇవ్వాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, జిల్లా కార్య నిర్వహణ కార్యదర్శి మహంతి ధనుంజయ డిమాండ్ చేశారు. నిజమైన లబ్దిదారులకు కాకుండా వైసీపీ పెత్తందారులు చేతిలోకి అయిదు, పది ప్లాట్లు చొప్పున వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుని రియల్ ఎస్టేట్ మాదిరిగా ప్లాట్లు అమ్ముకున్నట్టుగా యదేచ్చగా అమ్ముకున్న తీరును జనసేన పార్టీ తరుపున ఖండించారు. అలాగే పట్టాలు లేకుండా కొంతమంది పలుకుబడి గల వ్యక్తులు ఇళ్ల నిర్మాణం అక్రమంగా చేపట్టారని, ఈ విషయం ప్రభత్వ అధికారులు చూసి చూడనట్టాగా ఎందుకు వ్యవహారిస్తున్నారని ప్రశ్నించారు. రామభద్రపురంలో వారు తహసీల్దార్ తో మాట్లాడుతూ లబ్దిదారులు వివరాలు కావాలని అడిగితే నా దగ్గర లేదు పాత ఎం.ఆర్.ఓ దగ్గర ఉందని బీరువాలో ఉన్నాయని తాళం నా దగ్గర లేదని పాత ఎం.ఆర్.ఓ గణపతి రావు దగ్గర తాళం ఉందని చెప్పటం చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. లేఔట్ వివరాలు లబ్దిదారులు వివరాలు ఎం.ఆర్.ఓ ఆఫీస్ లో మరియు హోసింగ్ డిపార్ట్మెంట్ లో ఎక్కడా లేదని చెప్పటం చాలా అనుమానాలకు తావిస్తుంది. ఈ విషయమై ప్రభత్వ అధికారులు తక్షణమే జరిగిన పొరపాట్లను సరి చేసుకోకపోతే రామభద్రపురం ప్రజల తరఫున జనసేన పార్టీ ఆధ్వర్యంలో న్యాయ పోరాటం చేసి మరీ జగన్నన్న లేఔట్ లో జరిగిన అవినీతిలో బాగాస్వామిలైన అధికారులు నాయకులు మీద తగిన చర్యలు న్యాయస్థానం ద్వారా చేపట్టేలా పోరాటం చేస్తామని తెలిపారు, ఈ అంశాలను డిమాండ్ చేస్తూ ఎం.ఆర్.ఓ కు వినతిపత్రం కూడా అందచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యకులు బవిరెడ్డి మహేష్ బొబ్బిలి మండల అధ్యక్షులు సంచన గంగాధర్, తెర్లం మండల అధ్యక్షలు రవి, పారది ఎంపీటీసీ అభ్యర్థి బంటుపల్లి దివ్య, వీరమహిళ రమ్య, నాయకులు సతీష్, వెంకటేష్, భాష మరియు జనసేన కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.