గజపతినగరం జనసేన నూతన మండలాధ్యక్షులకు ఘన సత్కారం

  • నూతనంగా ఎంపికైన మండలాధ్యక్షులను సత్కరించిన ఆదాడ మోహనరావు

గజపతినగరం: విజయనగరం జిల్లా జనసేన పార్టీలో నూతన మండల అధ్యక్షులను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన గజపతినగరం మండల అధ్యక్షడు మునకాల జగన్నాథరావు, గంట్యాడ మండల అధ్యక్షుడు సారికి అప్పలరాజు, దత్తిరాజేరు మండల అధ్యక్షుడు చప్పా అప్పారావు లను పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు దుస్సాలువాలుతో గజపతినగరంలో సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ పదవులు అలంకరణకోసం కాకుండా పార్టీ అందరినీ కలుపుకొని, పార్టీబలోపేతం కోసం శ్రమించాలని, జనసేన పార్టీ లో అందరికీ అవకాశాలు ఉంటాయని, ఇతర పార్టీల్లో ఎన్నో సంవత్సరాలు చేస్తే గాని రాని అవకాశాలు జనసేన పార్టీ కల్పిస్తుందని అన్నారు. మండల అధ్యక్షులుగా నియమింపబడిన జగన్, అప్పారావు, అప్పలరాజు మాట్లాడుతూ పార్టీ మామీద ఉంచిన నమ్మకంతో ఇచ్చిన ఈ పదవి ఎంతో బాధ్యతను పెంచిందని, ఇదే ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి కష్టపడతామన్నారు.