జనసేన పార్టీ పుత్తూరు టౌన్ కమిటీ కీలక సమావేశం

పుత్తూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం పుత్తూరు మండల జనసేన అర్బన్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ బూత్ లెవల్ కమిటీ మరియు మండల స్థాయిలో పార్టీ బలోపేతం చేయడానికి కార్యాచరణ చేయాలని సూచించారు. జనసేన పార్టీకి ఆకర్షితులై కొందరు యువకులు, వీరమహిళలు చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగరి నియోజకవర్గం ఇంచార్జీ మెరుపుల మహేష్, జిల్లా ప్రోగ్రాంకో ఆర్డినేటర్ నాగార్జున, పుత్తూరు మండల అధ్యక్షుడు జగదీశ్వర్ రాజు, ఐటీ కో ఆర్డినేటర్ అశోక్, రూరల్ అధ్యక్షుడు వెంకట ముని, ప్రధాన కార్యదర్శులు భానుప్రకాష్, దిలీప్, చైతన్య సాగర్, మోనిష్, సాయి, సురేష్, చందు, శివ, కుమార్, శ్రీను, రాజేష్, బుజ్జి, దీపక్, ప్రవీణ్, మరియు జనసేన పుత్తూరు టౌన్ కమిటీ సభ్యులు హాజరయ్యారు.