ఆంధ్ర రాష్ట్రంలో అడుగు అడుగునా ఉన్న వాటిని రోడ్లు అంటారా: దారం అనిత

ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా నుండి చిత్తూరు జిల్లా వరకు ఏ జిల్లాలో చూసినా రోడ్లు అత్యంత ప్రమాదకరంగా.. భయానకంగా మారాయి. పల్లెల్లోని రహదారుల్లో ప్రయాణం ప్రాణాల మీదకు వస్తోంది. కొన్నేళ్లుగా కనీస నిర్వహణ లేక మరమ్మతులకు నోచుకోక పోవడంతో రోడ్లన్నీ అత్యంత ప్రమాదకరంగా మారాయి. వర్షం పడితే పరిస్థితి మరీ దారుణం.

పల్లెల నుండి వ్యవసాయ ఉత్పత్తుల్ని తరలించాలన్నా.. సాగుకు అవసరమైన ఎరువులు వంటివి తెచ్చుకోవాలన్నా.. ఈ అద్వానపు రోడ్ల మూలంగా ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. ఒక పల్లె కాదు ఒక ఊరు కాదు, ఎక్కడ చూసినా ఇదే దుస్థితి.

ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధుల్ని రాష్ట్రప్రభుత్వం మూడేళ్లుగా రహదారులకు నామమాత్రంగా ఇస్తూ.. అధికశాతం నిధులు భవనాల నిర్మాణానికి కేటాయించడంతో గ్రామాలలో రహదారులు కనీస మరమ్మతులకు కూడా నోచుకో వట్లేదు. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ లతో చేపట్టిన రహదారుల పనులు గుత్తేదారులకు బిల్లులు చెల్లించక నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా పల్లె రోడ్లు మరీ అధ్వాన స్థితికి చేరుకున్నాయి.

25 జిల్లాలు పరిశీలిస్తే రోడ్ల పొడవు 166 కిలో మీటర్లు ఉండగా.. కనిపించిన గుంతలు 6220 సగటున ఒక కిలో మీటర్ కి 37 గుంతలు కనిపిస్తున్నాయి. రోడ్ల పరిస్థితి ఇలా ఉండటం వల్ల కొన్ని ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. ద్విచక్ర వాహనాల్లో పైనుండి పడి ఎవరో ఒకరు పడి గాయాల పాలవుతూ వున్నారు. కనీసం బైకుల మీద వెళ్లాలంటే కూడా హడలిపోతున్నారు జనం. దివ్యాంగులకు స్కూలుకు వెళ్ళే పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యంతో బాధ పడే వారి పరిస్థితులు మరీ దారుణం.. ఆరోగ్య పరంగానే కాదు ఆర్థిక పరంగా కూడా పల్లె జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి ఈ రహదారులు. పెద్ద గుంతులు రోడ్లపై ఉండటంతో ఎంత జాగ్రత్తగా వెళ్లినా వాహనాలకు ప్రమాదం జరిగే సందర్భాలు చాలా ఉన్నాయి.

గత సీజన్లో వర్షాకాలం వచ్చేసిందని ఇప్పుడు రోడ్లు బాగు చేయలేమని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. వర్షాలు తగ్గాక పనులు చేస్తామని తర్వాత పట్టించుకోలేదు. ఇటీవలే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి సమీక్షించి నప్పుడు గ్రామీణ రహదారులు వెయ్యి కోట్లు అవసరమని అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. టెండర్లు పిలిచి పాడైన రహదారులు బాగు చేయాలని సీఎం ఆదేశించారు. ఎప్పుడ టెండర్లు పిలవాలి.. ఎప్పుడు పనులు చేయాలి.. నెలరోజులు ఆగితే మళ్లీ వర్షాకాలం మొదలవుతుంది. అప్పుడు మళ్ళీ వర్షాలు వచ్చేశాయ్ అని అధికారులు వాయిదా వేస్తారేమోనని.. జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత ఎద్దేవా చేశారు.