కలెక్టర్ కి వినతిపత్రం అందించిన గల్లా తిమోతి

కృష్ణాజిల్లా, మచిలీపట్నం నియోజకవర్గం, పెదయాదర పంచాయితీ గ్రామంలోని పలు సమస్యల్లో ఒకటైన గ్రామస్తులకు ఆర్ ఓ ప్లాంట్ వాటర్ సదుపాయం కొన్ని దశాబ్దాలుగా లేనందున పంచాయితీకి గిఫ్టుగా వచ్చిన రెండువేల లీటర్ల కెపాసిటీ కలిగిన వాటర్ ప్లాంట్ ను పంచాయతీ తీర్మానం చేసి పెదయాదర వంతెన సెంటర్లో ఉన్న సిపిడబ్ల్యూఎస్ వాటర్ ట్యాంకు అనుసంధానపరిచి గ్రామంలోని వృద్ధులకు, ఇతర గ్రామస్తులకు అందుబాటులోకి తెచ్చే విధంగా అనుమతులను మంజూరు చేయాలని దీనిపై గతంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీకి, ఎంపీడీవో కి, డిడబ్ల్యూఎంఎపిడి కి మరియు డిపిఓ కి రెండు నెలల క్రితమే తెలియజేసి తీర్మాన పత్రాన్ని జత పరిచి వినతి పత్రం ఇచ్చామని దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తక్షణమే దీనిపై అనుమతులు ఇస్తూ అధికారులు ఆదేశించవలసిందిగా గౌరవ కలెక్టర్ కి సోమవారం జరిగిన స్పందనలో గ్రామ సర్పంచ్ గల్లా తిమోతి వినతి పత్రం అందించారు అలాగే గత ఏడు నెలల క్రితం పంచాయతీ వారు తీర్మానం చేసి గ్రామంలోని ఎస్టీ కాలనీ మరియు నూతనంగా నిర్మించిన రోడ్లలో విద్యుత్ స్తంభాలను కొత్తగా నిర్మించే దిశగా మీసేవ నందు అర్జీ మరియు సంబంధిత కాగితాలను గ్రామ ఈవో ద్వారా గౌరవ రూరల్ ఏఈ కి అందజేసిన దరిమెల మరియు పలుమార్లు వాకబు చేయగా వారు గత ఏడునెలలుగా కనీసం చూడడానికి వచ్చి ఎస్టిమేషన్ వేయట్లేదని తక్షణమే ఈ సమస్యను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొస్తున్నామని స్పందన అర్జీ ద్వారా గల్లా తిమోతి కలెక్టర్ ని కోరారు. ఈ రెండు సమస్యల పైన సంబంధిత అధికారులను సమస్యలను పరిష్కరించవలసిందిగా కలెక్టర్ ఆదేశించారు.