క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: కామిశెట్టి రమేష్

గురజాల: జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడో విడత క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మొదలైన సంగతి మనందరికీ తెలిసిందే.. ఫిబ్రవరి 28వ తేదీ వరకూ కొనసాగుతుంది, కావున ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు, దేశ రాష్ట్ర రాజకీయ పార్టీలలో ఎక్కడా లేనివిధంగా కార్యకర్తల బాగోగుల గురించి ఆలోచించే ఏకైక పార్టీ జనసేన పార్టీ అని కొనియాడారు, పార్టీలో కష్టపడే కార్యకర్తలకు ప్రమాదవశాత్తు ఏదైనా ఆపద వస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రమాద బీమా 50 వేల రూపాయలు, ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా అందిస్తుందని తెలియజేశారు, ఇప్పటికే మూడు లక్షల 50 వేలకు పైగా జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులకు సభ్యత్వం అందించారని అదేవిధంగా.. మూడో విడతలో కూడా ఐదు లక్షలకు పైగా సభ్యులకు క్రియాశీలక సభ్యత్వం అందించాలని అన్నారు, గతంలో సభ్యత్వం తీసుకున్నవారు ఇప్పుడు మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు అందరూ కూడా కలిసికట్టుగా క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, గురజాల నియోజకవర్గంలో అత్యధికంగా సభ్యత్వాలు చేయాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మండల క్రియా వాలంటీర్స్ పెడకొలుమి కిరణ్ కుమార్, అంబటి సాయికుమార్, గద్దెనబోయిన సతీష్, షేక్ మదీనా, మునగా వెంకట్, నియమించామని తెలియజేశారు.