వైసీపీ వైఖరికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు: పూల శివ ప్రసాద్

కొత్తచెరువు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2022 – 23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రెండున్నర లక్షల కోట్లతో పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు ఎటువంటి అభివృద్ధి ప్యాకేజీని ఏర్పాటు చేయలేదు. అదే విధంగా ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ ఇస్తామన్న యువతకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. రాష్ట్రంలో ఉద్యోగుల నిరసన దీక్షలపై ప్రజల దృష్టిని మళ్లించడానికి జిల్లాలు ఏర్పాటు చేయడం తప్ప.. జిల్లాలో అభివృద్ధిని నిజంగా ఈ ప్రభుత్వం కోరుకోవటం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. యువత కి ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో 90 వేల ఉద్యోగాల వరకు నోటిఫికేషన్లు విడుదల చేశారు. కానీ మన రాష్ట్రంలో ఎటువంటి పరిశ్రమలు రానివ్వకుండా, వాలంటీర్లు మటన్ అమ్మకాలు, చేపల అమ్మకాలు అంటూ ఈ యువతరాన్ని నిరుత్సాహపరుస్తూ దెబ్బతీస్తున్నారు. అంతేకాకుండా కాపు కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ లకు మునుపటి సంవత్సరమే కేటాయించిన డబ్బులే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడకుండా వారి పథకాలకు మళ్లించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే జరుగుతోంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని పక్కనపెట్టి వారి నాన్నగారు, వారి పేరు ఉన్న సంక్షేమ పథకాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే విధంగా పాలన ముందుకు వెళితే రేపటి యువతరం ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు వలసలు పోవడం మరింత ఎక్కువ అవుతుంది. ఈ ప్రభుత్వ వైఖరికి తప్పకుండా ప్రజలు వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా వీరికి బుద్ధి చెప్పి ఇంటికి పంపిస్తారని జనసేన పార్టీ తరఫున కొత్తచెరువు మండల అధ్యక్షులు పూల శివ ప్రసాద్ తెలియజేయడం జరిగింది.