నిబంధనల పేరుతో అమ్మలకు అమ్మ ఒడి దూరం

కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో ఉత్తమమైన అమ్మ ఒడి పథకాన్ని నిబంధన పేరుతో అమ్మలకు అమ్మబడి దూరం చేస్తున్నారని జనసేన పార్టీ పీఎసి సభ్యులు ముత్తా శశిధర్ పేర్కొన్నారు. గురువారం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ జిల్లాలో 28వేల మంది అమ్మ ఒడి కి అర్హత కలిగి ఉంటే నిబంధనల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 7,456 మంది లబ్ధిదారులు తొలగించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎన్నికల్లో కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఏడాదికి 15 వేల రూపాయలు చొప్పున అమ్మ ఒడి వేస్తామని చెప్పడం జరిగిందన్నారు. అయితే మొదట రెండు సంవత్సరాలు 15 వేల చొప్పున వేసి మూడు, నాలుగు సంవత్సరాలు 13 వేల రూపాయలు చొప్పున వేయడం జరిగిందన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఐదో విడత కూడా లబ్ధిదారులకు అమ్మబడి వేయాలని డిమాండ్ చేశారు. కరెంటు బిల్లు ఇతర కారణాలతో అమ్మ ఒడిని తొలగించిన లబ్ధిదారులకు జనసేన పార్టీ మద్దతుగా ఉండి పోరాటం చేస్తుందని తెలిపారు. ఆఖరికి చెత్త పన్ను పేరుతో అమ్మ ఒడి లోకి నుంచి డబ్బులు తీసుకోవడం దురదృష్టకరమన్నారు. అమరావతిలో ఫేసు2 కింద లబ్ధిదారులకు ఇల్లు కట్టే ఇచ్చే విధానాన్ని కాకినాడలో లబ్ధిదారులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి నరసాపురం వరకు వారాహి యాత్రలో ప్రజలకు సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేయాలో సూచించడం జరిగిందని, దాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్ విమర్శించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు వారాహి అని పలకడం కూడా రాకపోవడం దురదృష్టకరమని, జగన్ మరొకసారి పాఠశాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్ కూడా అమ్మ వాడు వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమస్యలో జనసేన సిటీ అధ్యక్షుడు సంగిశెట్టి అశోక్, జనసేన పార్టీ నాయకులు తలాటం సత్య, అడబాల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ర్యాలీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.