ప్రారంభమైన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం.. పాల్గొన్న మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆధ్వర్యంలో 44వ జీఎస్టీ మండలి సమావేశం కొనసాగుతున్నది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ నీతూప్రసాద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్‌ అత్యవసర వస్తువులు, బ్లాక్‌ ఫంగస్‌ మందులపై పన్ను రేట్ల తగ్గింపు, ఆక్సిజన్‌, ఆక్సీమీటర్లు, శానిటైజర్లు, వెంటిలేటర్లతో సహా పలు ఇతర వస్తువులపై జీఎస్టీ రాయితీ ఇచ్చే అంశాలను గురించి చర్చిస్తున్నారు.