ఐతవరం గ్రామంలో ఘనంగా జనసేన జెండా దిమ్మ ఆవిష్కరణ

నందిగామ నియోజకవర్గం: నందిగామ రూరల్ మండలం, ఐతవరం గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు వసంత నాగేశ్వరరావుని ఐతవరం గ్రామంలోని వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసిన నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి. ఐతవరం గ్రామంలో జనసేన పార్టీ జెండా దిమ్మ ఆవిష్కరణ సందర్భంగా అదే గ్రామంలో ఉంటున్న వసంత నాగేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం అంబారుపేట గ్రామంలో కొలువై ఉన్న సత్తెమ్మ తల్లిని దర్శించుకుని అక్కడనుండి జనసైనికులు భారీ ర్యాలీగా జెండా దిమ్మె స్థలానికి చేరుకున్నారు. నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవికి ఐతవరం గ్రామం ప్రజలు జనసైనికులు మరియు వీరమహిళలు ఘన స్వాగతం పలికారు. తదనంతరం జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి జనసైనికులు, వీరమహిళలు జనసేన నాయకులతో కలిసి జెండా వందనం చేసి, గ్రామంలో ఏర్పాటు చేసిన సభా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తంబళ్ళపల్లి రమాదేవి మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గంలో నిరుద్యోగం, డ్రైనేజీ వ్యవస్థలు సరిగా లేకపోవడం, తాగునీరు, సాగునీరు లేకపోవడం, రోడ్లు సరిగా లేకపోవడం, సాగర కాలువ ఎండిపోవడం, ఎత్తిపోతల పథకం పూర్తిగా ములనపడడం, ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే అభివృద్ధి నాకు అసలు కనపడలేదు. నందిగామ నవనిర్మాతలని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గార్లకి ఐతవరం గ్రామం నుండి నేను అడుగుతున్న, ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలు ఏమాత్రం మీరు నెరవేర్చారు.? మిమ్మల్ని ఓటు వేసి గెలిపించుకున్న ఈ ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే మీరు ఎందుకు మీ నాయకుడిని ప్రశ్నించడం లేదు, కనీసం మీకున్న హక్కులునైనా సరిగ్గా నెరవేర్చి ప్రజలకి ఎంతోకొంత అభివృద్ధిని చూపించవచ్చు, అది కూడా మీరు చేయకుండా ఎందుకు ఉన్నారు అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షుడు బొలియా శెట్టి శ్రీకాంత్, కాపు సంక్షేమ సేన నందిగామ అధ్యక్షుడు కరి రమేష్, మండలాధ్యక్షులు కడుపు గంటి రామారావు, వడ్డేలి సుధాకర్, ఉపాధ్యక్షులు కొమ్మవరపు స్వామి, చలమల సౌందర్య, ఆకుల వంశీ, సంయుక్త కార్యదర్శి తేజ మరియు జనసేన నాయకులు, జన సైనికులు, వీరమహిళలు, ఐతవరం గ్రామస్తులు పాల్గొన్నారు.