క్రిష్ణపల్లి ప్రభుత్వ లేఅవుట్లలో కనీస సదుపాయలు ఏర్పాటు చేయాలి: జనసేన డిమాండ్

పార్వతిపురం నియోజకవర్గం: జనసేన నాయకులు గుంట్రెడ్డి గౌరిశంకర్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షురాలు అగురుమణి సమక్షంలో క్రిష్ణపల్లి గ్రామంలో ప్రభుత్వ లేఅవుట్లను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి పార్వతిపురం మండల అధ్యక్షురాలు అగురు మణి మాట్లాడుతూ క్రిష్ణపల్లి గ్రామంలో జగన్న లేవుట్లలో
వైఎస్సార్సీపీ మినిస్టర్ గారి ప్రోగ్రాం వుంది అనేసరికీ యుద్ద ప్రాతిపదికన డ్రైనేజీ, రోడ్లు, కరెంట్ ఫోల్ ఏర్పాటు చేశారు. అదే లేవుట్లకు ఆనుకొని వున్న గత ప్రభుత్వం ఇచ్చిన చంద్రన్న లేవుట్లు కనీస సదుపాయలు ఏర్పాటు చేయలేదు. గత ఐదు సంవత్సరములు నుండి కూడ అలానే వుంది దానికి సంభందించిన అదికారులకు భాదితులు నిలదిస్తే మాకు కాంట్రాక్ట్ జగన్న లేవుట్లు మాత్రమే ఇచ్చారు అన్నారు. చంద్రన్న లేవుట్లు మాకు సంబందం లేదు అన్నారు. కొంత మంది చంద్రన్న లేఅవుట్లలో ఇల్లు కట్టుకొని కరెంట్, డ్రైనేజీ, రోడ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు కులం చూడం, మతం చూడం, రాజీకీయాలు చేయమని చెప్పి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇచ్చిన స్థలాలకు మాకు సంభందం లేదు అన్నటు వుండడం మంచి పద్దతి కాదు. దీనిని జనసేన పార్టీ తీవ్రంగా ఖడిస్తుంది. ఏవరైతే భాదితులు వున్నారో వారికి న్యాయం చేయాలని కోరుచున్నాము. ఒకవేళ వారికి న్యాయం జరగని పక్షాన జనసేన పార్టీ తరుపున మా పోరాటం ఉద్రిక్తం చేస్తామని అన్నారు. అదేవిదంగా సంభందిత అదికారులకు క్రిష్ణపల్లి సచివాలయంలో వినతి పత్రం అందచేయడం జరిగింది. మరియు ప్రోగ్రాం పర్యవేక్షణ చేస్తున్న ఆర్ డి ఓ అక్కడే వుండడంతో వారికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతిపురం మన్యం జిల్లా నాయుకులు ఖాత విశ్వేశ్వరావు, బొనేల గోవిందమ్మ, బంటు శిరీష్, కర్రి మణికంఠ, అంబటి బలరాం, తామరకండి తేజ, పైలా రాజు, కొయ్యన రామక్రిష్ణ, ఉపేంద్ర, సాయి, క్రిష్ణపల్లి గ్రామ ప్రజలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.