ఘనంగా జనసేన కార్యాలయ ప్రారంభోత్సవం

పెదకూరపాడు నియోజకవర్గం: అచ్చంపేట మండల అద్యక్షులు మట్టం వీరభద్ర అధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు జనసేన పార్టీ నూతన పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాదు, చట్టాల త్రినాథ్, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త యర్రంశెట్టి రామకృష్ణ, సత్తెనపల్లి జనసేన నాయకులు వళ్ళెం శ్రీనివాస్, పెదకూరపాడు నియోజకవర్గ 5 మండలాల అధ్యక్షులు శివ నాగేశ్వరరావు, వాకా అఖిల్, తోట రమాదేవి, చలపతి రావు, దేవిసెట్టీ అనంత రామయ్య, శాఖమూరి శ్రీనివాస్, బిల్లురి సురేష్ నియోజకవర్గ నాయకులు జనసైనికులకు పాల్గొన్నారు.