వరికూటి నాగరాజు ఆధ్వర్యంలో జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఎన్నారై క్యాలెండర్ ఆవిష్కరణ

మంగళగిరి, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకెళ్ళే విధంగా జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ మరియు శతఘ్ని న్యూస్ సంయుక్తంగా రూపొందించిన జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ 2024 ఎన్నారై క్యాలెండర్ ను దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు మరియు కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం జనసేన నాయకులచే ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ప్రెసిడెంట్ కె.కె, జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ప్రకాశం జిల్లా అధ్యకులు షేక్ రియాజ్, జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ధర్మవరం సమన్వయకర్త చిలకం మధుసూదన్ రెడ్డి, అనకాపల్లి సమన్వయకర్త మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు, రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్, సెంట్రల్ ఆంధ్ర ఎన్నికల కమిటీ సభ్యులు మాదాసు రమేష్ మరియు వివిధ ప్రాంతాల జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన గ్లోబల్ టీం చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు.