ఆగూరు మణి ఆధ్వర్యంలో యువశక్తి పోస్టర్, నూతన సంవత్సర క్యాలండర్ ఆవిష్కరణ

పార్వతీపురం: యువత భవిష్యత్తును ఉద్దేశించి గళం వినిపించటానికి జనసేనాని ప్రతిష్టాత్మకంగా జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో చేపట్టబోయే యువశక్తి కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణను పార్వతీపురం నియోజకవర్గం & మండల అధ్యక్షురాలు ఆగూరు మణి ఆద్వర్యంలో నియోజవర్గ పరిధిలో పలు గ్రామాల్లో నిర్వహించి, నూతన సంవత్సరం సందర్భంగా క్యాలెండర్లను పంచిపెట్టి యువశక్తి ప్రోగ్రాం పట్ల, పార్టీ సిద్ధాంతాల పట్ల అవగాహన కలిపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోవిందమ్మ, బాలు, విశ్వేశ్వర రావు, గౌరీశంకర్, గణేష్, రాజు, ప్రదీప్, అశోక్, మణికంఠ, దుర్గ, సాయి, తిరుపతి మరియు జనసైనికులు పాల్గొన్నారు.