కడవకుదురు జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పర్చూరు నియోజకవర్గం: చిన్నగంజాం మండలం, కడవకుదురు గ్రామంలో జనసేన పార్టీ ఆఫీస్ నందు 77వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వేడుకలలో భాగంగా జనగంజం మండలం ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి హరిబాబు ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు సందు శ్రీనివాసరావు అధ్యక్షతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపూడి విజయ్ కుమార్ జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు ఆమంచి శ్రీనివాసరావు (స్వాములు) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇండియన్ ఆర్మీలో పనిచేసే వివిధ హోదాల్లో పదవీ విరమణ చేసిన సైనికులకు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారిని సన్మానించుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ భారత సైనికుల్ని సన్మానించుకోవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఆమంచి శ్రీనివాసరావు (స్వాములు) మాట్లాడుతూ భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో నడుస్తుంది రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి కావాలని అవసరమైతే గ్రామ గ్రామానికి వెళ్లి పార్టీ బలోపేతం చేస్తానని ఆయన తెలిపారు. అనంతరం ఈ భారతదేశానికి సేవలు అందించిన వారిని సన్మానించుకోవటం చాలా ఆనందంగా ఉందని ఇలాంటి కార్యక్రమం చేస్తున్న గ్రామ యువకులు అందరికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ యువ నాయకులు తోట అశోక చక్రవర్తి, ఆర్ఎంపీ కట్టిపోయిన సుబ్బారావు, షేక్ జిలాని, షేక్ షబీర్ కేశిన బాలయ్య, గొల్లపూడి వసంత రాయుడు, జనసేన పార్టీ మండల కార్యదర్శి బొప్పన సాయి, ఇందుర్తి వెంకటేశ్వర్లు, గంధం వెంకట్రావు (కాకయ్య), మాదాసు సురేషు, రాచూరి సాయి, గొల్లపూడి మస్తాన్, సోమిశెట్టి పెద్ద రాఘవరావు, పేరాబత్తుల ప్రసాదు (భద్ర) తదితరులు పాల్గొన్నారు.