16వ డివిజన్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

గుంటూరు: గుంటూరు పట్టణంలోని 16వ డివిజన్ లోని ఏటుకూరు, బుడంపాడు, బోంతపాడులలో నేడు 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినాయని గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలలో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి దాసరి లక్ష్మి దుర్గ ముఖ్య అతిథిగా హాజరైన జెండా వందనం సమర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మి దుర్గ మాట్లాడుతూ.. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన భారతదేశ వీరుల పోరాటాన్ని స్పూర్తిగా తీసుకుని అందరూ తమ శక్తి వంఛన లేకుండా దేశసేవ కోసం పునరంకితం కావాలని ఆమె కోరారు. విద్యార్థిని, విద్యార్థులు అందరూ ఉన్నత విద్యను అభ్యసించి రానున్న రోజుల్లో దేశ సమగ్రత కోసం అహర్నిశలు శ్రమించాలని పోరాట యోధుల సరసన నిలవాలని లక్ష్మీ దుర్గ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగఫలమే నేడు మనమందరం అనుభవిస్తున్న స్వేచ్చా స్వాతంత్ర్యం అని ఉప్పు వెంకట రత్తయ్య అన్నారు. భారతదేశం స్వాతంత్ర్యం సాధించటానికి మన సమరయోధులు ఏన్నో రకాలుగా ఉద్యమాలు చేపట్టి అహింసా శాంతియుత ధర్మాలు తోటి ఎందరో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈసంగ్రామములో తమ వంతు పాత్ర పోషించి బ్రిటిష్ సామ్రాజ్యానికి చెరమగీతం పాడి చివరికి దేశానికి స్వాతంత్య్రం అందించినారని ఆ త్యాగధనులను మనం స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఉప్పు వెంకటరత్తయ్య అన్నారు. ఈ సందర్భంగా వారి ఆత్మ శాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించినారు. తదనంతరం పిల్లలకు, పెద్దలకు, మహిళలకు, యువకులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ అధ్యక్షుడు విష్ణుమెలకల ఆంజినేయలు, నగర కార్యదర్శి పావులూరి కోటేశ్వరరావు, శివాలశెట్టీ శ్రీనివాసరావు, తన్నీరు రవికుమార్, జిడుగు సుబ్బారావు, యడ్లపల్లి దానారావు, దాది ఆంజి, అములోతు నాగరాజు, దాసరి వాసు, తన్నీరు రమణ, గళ్ళా కోటేశ్వరరావు మేడూరి సులోచన, బూరగడ్డ అంకమ్మరావు తదితరులు పాల్గొన్నారు.