కలెక్టర్ కు వినతిపత్రం అందించిన బోనకల్ జనసేన నాయకులు

  • చిరునోముల, చొప్పకట్లపాలెం రోడ్డు గురించి జనసేన పార్టీ నాయకుల పోరాటం

మదిర, ఖమ్మం జిల్లా బోనకల్ మండలం చిరునోముల చొప్పకట్లపాలెం ఆర్ అండ్ బి రోడ్డు ఎంతో ఇబ్బందికరంగా ఉండడంతో చొప్పకట్లపాలెం గ్రామ ప్రజలు బోనకల్ రావాలంటే వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వాహనదారులు వాపోతున్నారు, ఈ రోడ్డులో గత ఐదు సంవత్సరాలు నుంచి ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ సమస్యను కలెక్టర్ కు జడ్పీ చైర్మన్ కు బోనకల్ జనసేన ఆధ్వర్యంలో వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోనకల్ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తాళ్లూరి డేవిడ్, మండల ఉపాధ్యక్షుడు, నరసింహ శెట్టి,నరేష్, ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన విద్యార్థి విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంధం ఆనంద్, బోనకల్ జనసేన పార్టీ ఎగ్జిక్యూట్ మెంబర్ ఎస్ కే జానీ పాషా మండల నాయకులు ఆది, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.