వీరఘట్టం మండలంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పాలకొండ నియోజకవర్గం: వీరఘట్టం మండలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారత 77వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన జానీ మాట్లాడుతూ నా దేశ పౌరులు అందరికి ముందుగా శుభాకాంక్షలు.
77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా వీరఘట్టం టౌన్ లో జెండా వందనం చేసిన అనంతరం స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటమే స్వాతంత్రోద్యమని, భారతదేశ దాస్యశృంఖలాలను విడిపించి, దేశప్రజలకు స్వేచ్చా, స్వాతంత్ర్యం ప్రసాదించడంకోసం ఎందరో మహానుభావులు వారి ఆస్తులను, ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసినందుకే నేడు మనకు ఈ స్వాతంత్య్రఫలాలు అందాయని, వారి త్యాగాలఫలితం భారతభూమికి, ప్రజలకు స్వాతంత్య్రం సిద్ధించిందని, భారత దేశ స్వాతంత్రం యొక్క పరమార్ధం ఏమిటి? ఏ లక్ష్యంతో స్వాతంత్ర్యం కోసం మన పెద్దలు ఆరాటపడ్డారు? పోరాడారు? అనే అంశం ప్రతి భారతీయుడు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి నేను ముందు ఒక భారతీయుడిననీ మాట్లాడుతారని, ప్రజలందరికీ సమాన స్వేచ్ఛ బలవంతులకు బలహీనులకు సమాన అవకాశాలు ఉండే ప్రజాస్వామ్యాన్ని మహాత్మా గాంధీ కలలుగన్నరని మన స్వాతంత్ర్యం ఉద్యమాల చరిత్రఅని, విమర్శలను ఏమాత్రం తట్టుకోలేని నాయక శ్రేణులు చీకటి మాటను ఉన్న చట్టాలను నచ్చని వారిపై ప్రయోగిస్తున్నారని, అపరిమిత స్వేచ్ఛతో అవినీతిపరులు ఒకవైపు సమాజాన్ని లూటీ చేస్తున్నారని, విద్వేష విషాన్ని విరజిమ్ముతూ జనాన్ని ఎక్కడికక్కడ విడదీస్తూ నేతలు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని, దేశభక్తిని ప్రజలకు అలవర్చాలంటే పాలకుల మాటల్లో కాదు చేతల్లో మార్పు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియశీలక వాలంటీర్స్ మత్స. పుండరికం, కోడి వెంకట్ నాయుడు కర్నెన సాయి పవన్ మరియు అనిల్, గణేష్, చరణ్, పండు, కార్తీక్, బన్నీ జీవన్, మణి, రాకేష్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.