భారత్-ఆసీస్ : పింక్ టెస్ట్ అప్డేట్

ఆసీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు అక్కడ పరిమిత ఓవర్ల సిరీస్ లు ముగించుకొని తొలి టెస్ట్ సిరీస్ ను ఆరంభించింది. అయితే ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న పింక్ టెస్ట్ లో మూడో రోజు ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ లో మొదట బేటింగ్ చేసిన భారత జట్టు కోహ్లీ (74)తో రాణించడంతో 244 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. ఆ తర్వాత బ్యాటింకు వచ్చిన ఆతిధ్య జట్టు ను భారత బౌలర్లు బోల్తా కొట్టించారు. దాంతో ఆసీస్ 191 పరుగులకు ఆల్ ఔట్ కావడంతో భారత్ కు 53 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే ఈ ఇన్నింగ్స్ లో అశ్విన్ 4 వికెట్లు, ఉమేష్ 3 వికెట్లు, బుమ్రా రెండేసి వికెట్లు సాధించారు. ఆ తర్వాత భారత జట్టు రెండో రోజు చివర్లో తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే మొదటి ఇన్నింగ్స్ లో నిరాశపరిచిన పృథ్వీ షా(4)తో ఔట్ కావడంతో భారత్ రెండో రోజు ముగిసే సమయానికి 9 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం మయాంక్ (5), బుమ్రా (0) బ్యాటింగ్ చేస్తున్నారు.