కరోనాను అధిగమించడానికి ప్రపంచానికి భారత్ సహాయపడుతుంది

కరోనా వైరస్‌ను  అధిగమించడానికి ప్రపంచవ్యాప్తంగా రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి.. అయితే, అందరిచూపు మాత్రం భారత్‌పైనే ఉంది.. ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా.. కోవిడ్ వ్యాక్సిన్ల తయారీలో భారత పాత్ర కీలకం కానుంది అంటూ బిల్‌గేట్స్ లాంటివారు కూడా వ్యాఖ్యానించారు.

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం యూఎన్ సర్వసభ్య సమావేశంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తి చేసే దేశంగా, ప్రపంచ సమాజానికి మరో హామీ ఇవ్వాలనుకుంటున్నానని మోదీ అన్నారు. కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మానవులందరికీ సహాయపడటానికి భారతదేశం యొక్క వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరా సామర్థ్యం ఉపయోగించబడుతుందని మోదీ చెప్పారు. కరోనా అనంతరం మారిన పరిస్థితుల్లో స్వయం సమృద్ధి భారత్ విజన్‌తో తాము ముందుకు వెళ్తున్నాం. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు స్వయం సమృద్ధి భారతం ఒక శక్తిలా నిలుస్తుందన్నారు ప్రధాని మోడీ.