రైతులకు, కార్మికులకు మౌలిక వసతులు కల్పించాలి: జనసేన డిమాండ్

మదనపల్లి నియోజకవర్గం: మదనపల్లిలో టమోటో మార్కెట్ లో అధికారికి రైతు సమస్యలపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందచేయడం జరిగింది. రైతుల దగ్గర నుండి నిలువు దోపిడీ చేస్తున్నారని 4% కమిషన్ స్థానంలో 10% కమిషన్ తీస్తున్నారని, జాక్ పాట్ విధాన్నాని పూర్తిగా రద్దు చేయాలనీ, రైతులకు, కార్మికులకు మౌలిక వసతులు కల్పించాలని కొన్ని కోట్ల రూపాయలు రైతుల దగ్గర నుండి మార్కెట్ ఆదాయం వస్తున్నా మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం వైపల్యం చెందిందని, వీటిపై మార్కెట్ యజమాన్యం చర్యలు తీసుకోకపోతే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున అందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్, రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, మదనపల్లి మండల రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, జంగాల గౌతమ్, కుమార్, రెడ్డెమ్మ, జయ, నవాజ్, సత్య, సన్నీ తదితరులు పాల్గొన్నారు.