వైసిపి పాలనలో అన్ని వర్గాలకి అన్యాయమే: కోన తాతారావు

  • గాజువాక నియోజకవర్గం ఇంచార్జి కోన తాతారావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

గాజువాక నియోజకవర్గం: ఇంచార్జి కోన తాతారావు ఆధ్వర్యంలో ఆదివారం భారీ బైక్ ర్యాలీ నిర్హించడం జరిగింది. ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు కేంద్రం ప్రయత్నం చేస్తుంటే.. అడ్డుకోవాల్సిన సీఎం జగన్ అడ్డుకొనే ప్రయత్నం చేయకుండా తన సొంత ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వంకు వత్తాసు పలుకుతున్నాడు. ప్రైవేటికరణ ముసుగులో స్టీల్ ప్లాంట్ మిగులు భూములు ఆదానికి ఇచ్చేందుకు జగన్ కృషి చేయటం. గంగవరం పోర్టు ప్రభుత్వ రంగంలో వుంటే ఉపాధి వస్తుందని మత్సకారులు, ఉక్కు నిర్వాసితులు భూములిస్తే.. 2400 కోట్లు రూపాయలు విలువ చేసే పోర్టును, ప్రభుత్వం ఆస్తులను కేవలం 560 కోట్లకు అమ్మేసి వేల కోట్లు తన జేబులో వేసుకోవటం ఉపాధికొరకు రాష్ట్ర నలుమూలల నుంచి గాజువాక వచ్చి అద్దై ఇళ్లలోను, కొండల మీద షెడ్డులలోని దశాబ్దాలు తరబడి మగ్గిపోతుంటే వైసిపి ప్రభుత్వం వారికి 100 గజాలు స్థలం ఇవ్వటానికి చేతులు రావు.. కానీ వైసిపి పెద్దలు, అనుసరులకు ఎకరాలల్లో అప్పనంగా కేటాయయించటమో లేక ఆక్రమించటానికి సహకరించటాన్ని నిరసిస్తూ
వైసిపి పాలనలో కొత్తగా ఒక్క పరిశ్రమ రాక పారిశ్రామిక ప్రాంతములో ఉన్న యువత నిరుద్యోగంతో వలస పోవటం లాంటి సమస్యలపై స్పందిస్తూ.. ఈ రోజు భారీ బైక్ ర్యాలీ ద్వారా ప్రజలు వద్దకు జనసేన శ్రేణులు వెళ్ళటం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టి నాయుకులు గడసాల అప్పారావు, దల్లి గోవిందరెడ్డి, తిప్పల వెంకటరమణారెడ్డి, వివిధ వార్డుల అధ్యక్షులు కరణం కనకారావు, కోన చిన అప్పారావు, ముమ్మన మురళి, రౌతు గోవింద రావు,లంకల మురళీ దేవి, గొలగాని గోపీచంద్, పోలరౌత్ వెంకటరమణ, చోడిపిల్లి ముసలయ్య, సంద్రాన భాస్కర్, మాకా షాలిని, జ్యోతి రెడ్డి, కాద శ్రీను, మెడిశెట్టి విజయ్, గవర సోమశేఖర్, చైతన్య, బలిరెడ్డి నాగేశ్వరావు, దుల్ల రామనాయుడు, సిరిసపల్లి కనకరాజు, చందక చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.