ఇన్నోవేషన్ ఇండెక్స్ జాభితా.. నాలుగో స్థానంలో తెలంగాణ

రెండవ ఇన్నోవేషన్ ఇండెక్స్ జాభితాను నీతి ఆయోగ్ విడుదల చేసింది. బుధవారం విడుదలైన నీతి ఆయోగ్ రెండో ఇన్నోవేషన్ ఇండెక్స్ లో కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు తెలంగాణ కేరళ ఆవిష్కరణలలో మొదటి ఐదు రాష్ట్రాలుగా నిలిచాయి. ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ మరియు సీఈఓ అమితాబ్ కాంత్ విడుదల చేసిన ఇండెక్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ తరహాలో అభివృద్ధి చేయబడింది. ఈ జాభితా లో జార్ఖండ్ ఛత్తీస్ ఘడ్ చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 ఆవిష్కరణలకు తోడ్పడే వారి సాపేక్ష పనితీరు ఆధారంగా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను ర్యాంక్ చేస్తుంది మరియు వాటిని మెరుగుపరచడానికి అధికారం ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రాలు కేంద్ర ఫాలిత ప్రాంతాల్లో ఆవిష్కరణల బలోపేతానికి అనుసరిస్తున్న విధానాల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయిస్తారు.