తెలంగాణ – ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఎగ్జామ్స్ తేదీలు ఇవే

తెలంగాణలో క‌రోనా ఉధృతి త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప‌రీక్ష‌లు లేకుండానే సెకండియ‌ర్‌కు ప్ర‌మోట్ చేసిన విద్యార్థుల‌కు.. తాజాగా ఎగ్జామ్స్ నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైంది. అక్టోబ‌ర్ 25 నుంచి వారికి ఫ‌స్ట్ ఇయ‌ర్ ఎగ్జామ్స్ నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

కేవ‌లం 70 శాతం సిల‌బ‌స్ నుంచే ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు స్ప‌ష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందినే ప‌రీక్ష‌ల‌ విధుల్లోకి తీసుకోనున్నారు. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. క‌రోనా సోకిన వారికి ప్ర‌తి సెంట‌ర్‌లో ఒక‌టి లేదా రెండు గ‌దుల‌ను ప్ర‌త్యేకంగా కేటాయించ‌నున్నారు.

ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు విడుద‌ల చేసిన ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదే