పోతిన వెంకట మహేష్, అక్కల గాంధీ ఆద్వర్యంలో టిడ్కో గృహాల పరిశీలన

  • టిడ్కో ఇళ్లకు ఛం జగన్ గ్రహణం పట్టింది
  • విజయవాడ నగరంలో 12000 మంది పేద ప్రజల సొంత ఇంటి కల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సాకారం కాదు
  • జగన్ గారి ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు జరగవు
  • వడ్డీలు వాయిదాలు కట్టలేక లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు
  • పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తూ విష సర్పాలకు ఆవాసంగా మారి నిర్మానుష్యంగా ఉండడం వలన అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయాయి
  • పరిశీలన నివేదిక పవన్ కళ్యాణ్ గారికి సమర్పిస్తాం
  • కేంద్రం పథకం రాష్ట్ర పథకం లాగా వైసిపి వారు కలరింగ్ ఇస్తున్నారు
  • ఇల్లు పూర్తి చేసి ఇస్తామని చెప్పి లబ్ధిదారుల మీదే భారం వేసిన మోసకారి జగన్

జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా జక్కంపూడి లోని టిడ్కో ఇళ్లను విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్, మైలవరం ఇన్చార్జ్ అక్కల గాంధీతో కలిసి సందర్శించినారు. ఈ కార్యక్రమంలో ముందుగా జనసేన పార్టీ జెండా దిమ్మ వద్ద జెండా ఆవిష్కరణ చేసి నా అనంతరం వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి భారీ ర్యాలీగా జక్కంపూడి షాబాద్ లో ఉన్న టిడ్కో గృహ సముదాయాన్ని విజయవాడ మరియు మైలవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మరియు అక్కల గాంధీలు విలేకరులతో మాట్లాడుతూ
విజయవాడ నగరంలో పేద సామాన్య ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చాలని గత ప్రభుత్వ హయాంలో జక్కంపూడి లో 10624 టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, అందులో భాగంగా 8284 ఎల్లా నిర్మాణం దాదాపుగా 70 శాతం నుంచి 90 శాతం పూర్తయిందని, 2019లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవాడ నగరంలో ఒక్కరికి కూడా టిడ్కో ఇళ్లను కేటాయించలేదని, లబ్ధిదారులు సుమారు 12,000 మంది సొంత ఇంటి కల నెరవేరుతుందని అప్పులు చేసి గత ప్రభుత్వంలో పాతికవేలు 50,000 లక్ష రూపాయలు చెల్లించారు నేడు వాటికి వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని, ఇల్లు అందజేయకుండానే బ్యాంకు రుణం ఇచ్చారని చెప్పి వాయిదాలు చెల్లించాలని రికవరీల పేరుతో బ్యాంకు వారు వేధింపులకు గురి చేస్తున్నారని, సొంత ఇంటి కల నెరవేరడం ఏమోగానీ ఇల్లు రాకపోయినా వడ్డీలు వాయిదాలు చెల్లించడం పేదలకు తలకు మించిన భారం అవుతుందని, ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించి అందజేస్తామన్న జగన్ గారి హామీ నీటి మీద రాతలు అయిందని, టిడ్కో ఇళ్లకు వైఎస్సార్సీపీ గ్రహణం పట్టిందని, ఇది ఎప్పటికీ వీడుతుందో?పట్టణ ప్రాంత పేద ప్రజల సొంత ఇంటి కల ఈ ప్రభుత్వంలో నెరవేరదని, జగన్ గారి ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు జరగవని మౌలిక సదుపాయాలైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సూయజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, స్ట్రాము వాటర్ డ్రైనేజ్, వాటర్ పైప్ లైన్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణం జరగలేదని, మూడున్నర సంవత్సరాలుగా ఇక్కడ పనులు జరగకపోవడం వలన ఈ గృహ సముదాయం మొత్తం అడవిలాగా మారిపోయిందని, పిచ్చి మొక్కలు పెరిగి అద్దాలు పగిలిపోయి అడవిని తలపిస్తూ విష సర్పాలకు ఆవాసంగా మారి నిర్మాణస్యంగా ఉండడం వలన అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయాయని, ప్రభుత్వం రాబోయే రెండు నెలల్లో పనులన్నీ పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయకపోతే వేలాదిమంది లబ్ధిదారులతో కలిసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. గడపగడపకు కార్యక్రమంలో టిడ్కో ఇళ్లకు గురించి మహిళలు ప్రశ్నిస్తే వారిపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగిస్తున్నారని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని టిడ్కో ఇళ్లకు ఇల్లు ఇవ్వడం చేతకాదు గాని కేసులు పెట్టడం మాత్రం వైఎస్సార్ సీపీకి బాగా అలవాటుగా మారిపోయింది అన్నారు ఇటువంటి పనికిమాలిన ప్రభుత్వం అతి తొందరలోనే కూలిపోతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి వంశీకృష్ణ, షేక్. అమీర్ భాష, నాగబాబు వేంపల్లి గౌరీ శంకర్, కొరగంజి రమణ, పొట్నూరి శ్రీనివాసరావు, వెన్న శివశంకర్, బొమ్ము రాంబాబు సింగినం శెట్టి రాము గుప్తా, పోలిశెట్టి తేజ చింతల లక్ష్మి, ఆకుల రవిశంకర్, సోమి గోవింద్, భవానీ ప్రసాద్, సాయినాగ్, కింబూరి కృష్ణ, ఏలూరి సాయి శరత్ తదితరులు పాల్గొన్నారు.