ఉరవకొండ జనసేన ఆద్వర్యంలో టిడ్కో ఇళ్ళ పరిశీలన

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, జిల్లా ఇంచార్జ్ టి.సి వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉరవకొండ పట్టణంలో లబ్ధిదారులకు కేటాయించిన టిడ్కో ఇళ్లను జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్, మండల అధ్యక్షులు చంద్రశేఖర పరిశీలించడం జరిగింది.

జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ ఉరవకొండ మండల కేంద్రంలోని జగనన్న కాలనీలో కేవలం శంకుస్థాపనకే పరిమితమయ్యయని.. జగనన్న లేఔట్లలో ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా పూర్తి కాకపోగా.. ఈ కాలనీలో మందుబాబులకు అడ్డాగా మారుతూన్నయని మండిపడ్డారు. జగనన్న కాలనీలో ఇప్పటివరకు సరైన విద్యుత్ సౌకర్యం గాని నీటి సౌకర్యం గాని ఏర్పాటు చేయలేని దుస్థితి ఉందని జనసెన పార్టీ తరుపున తీవ్రంగా కండించడం జరుగుతుఒదని తెలియచేశారు.

గత ప్రభుత్వం హయాంలో దాదాపు ఇళ్ళు పూర్తి అయ్యాయని చెప్పుకుంటూ ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తి అయినా ఇళ్ళు కూడా పూర్తి చేయకపోవడం చాలా దుర్మార్గం. పట్టించుకోక పోవడన్ని ఉరవకొండ జనసేన పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కూడేరు మండల అధ్యక్షుడు నాగేష్ మరియు బెలుగుప్ప మండల అధ్యక్షులు కాసంశెట్టి సుధీర్ మరియు జనసేన నాయకులు దేవేంద్ర, రాజేష్, అబ్దుల్, మల్లికార్జున, మల్లేష్ గౌడ్, జయ కుమార్, ప్రియతం, బోగేష్, గోపి, సురేష్, రమేష్, ప్రశాంత్, రామాంజి, మధు, తిప్పయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.