గురజాల జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆదేశానుసారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 12, 13, 14 తేదీలలో తలపెట్టిన జగనన్న ఇళ్లు – జనాలకు కన్నీళ్లు అనే కార్యక్రమంలో భాగంగా శనివారం పిడుగురాళ్ల లోని ఆదర్శనగర్ నందు జగనన్న కాలనీ పరిశీలన, మరియు #జగనన్న_మోసం డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలకు తెలిసేలా నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ మాట్లాడుతూ..జగనన్న ఇల్లు పేదలకు శరాఘాతంలా మారాయని… కేవలం శిలాఫలకాలకు మాత్రమే పరిమితమయ్యాయని అన్నారు.. జనవాసలకు దూరంగా నీవాసలకు ఆనువుగాలేని ప్రాంతాల్లో ఇచ్చారని అన్నారు.. చెట్లు పొదలు పాములతో..వర్షపు నీతితో నిండిన ప్రదేశాలలో పేదలకు స్థలాలు ఇవ్వడంలో అంత్యర్యమేటని ప్రశ్నించారు. జిల్లా సంయుక్త కార్యదర్శి కాసిం సైదా మాట్లాడుతూ.. జగనన్న కాలనీలు పెద్ద స్కాం అని, పేదవారి సొంతింటి కల కలగానే మిగిలిపోతున్నాయని, 40 ఎకరాల్లో సుమారు 1700 మందికి పైగా నిరుపేదలకు పిడుగురాళ్ల పట్టణంలోని ఆదర్శ కాలనీలో స్థలాలు కేటాయించి కనీసం ఒక ఇంటికి శంకుస్థాపన కూడా చేయని పరిస్థితి ఉందని, జగన్మోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పేదలకు కేటాయించిన స్థలాల్లో వెంటనే ఇల్లు నిర్మించాలని లేనిపక్షంలో బాధితులు తరఫున జనసేన పార్టీ పోరాడుతుందని హెచ్చరించారు. త్వరలో జగనన్న కాలనీలపై సోషల్ ఆడిట్ నిర్వహిస్తామని జనసేన నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో.. జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు దూదేకుల సలీం, మండల ఉపాధ్యక్షులు బయ్యవరపు రమేష్, పెడకోలిమి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శులు గుర్రం కోటేశ్వరరావు, ఆవుల రమేష్, కార్యదర్శులు మట్టం పరమేష్, గద్దెనబోయిన సతీష్, షేక్ గఫూర్,షేక్ వలి, బేతంచర్ల నాగేశ్వరరావు, జానపాడు గ్రామ ప్రధాన కార్యదర్శి అంబటి సాయికుమార్, గుర్రం చిన్న కోటేశ్వరరావు, బేతంచర్ల ప్రసాద్, సుంకర శ్రీనివాసరావు, అబ్బిశెట్టి ఆంజనేయులు, కామిశెట్టి అశోక్, గుర్రం అజయ్, అశోక్, మొదలగు వారు పాల్గొన్నారు.