ఆసక్తికరంగా నితిన్‌ ‘మాస్ట్రో’ ఫస్ట్‌ లుక్‌

యూత్ స్టార్ నితిన్ హీరోగా మెర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది. నితిన్ కెరీర్ 30వ చిత్రమిది. ఈ రోజు నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్.. టైటిల్ పోస్టర్ ను లాంచ్ చేశారు. పోస్టర్ లో నితిన్ లుక్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తోంది. జీన్స్ దానిపై సూట్ ధరించి చేతిలో వాకింగ్ స్టిక్ పట్టుకుని కనిపిస్తున్నాడు. ఆ కళ్లకు నల్లద్దాలు ధరించిన తీరు చూస్తుంటే అతడు అంధుడు అని అర్థమవుతోంది. ఆసక్తికరంగా బ్యాక్ గ్రౌండ్ లో పియానోపై రక్తపు మరకలు చూడగానే ఇది మ్యూజిక్ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ అని హింట్ ఇచ్చినట్టయ్యింది. నితిన్ ఈ చిత్రంలో అంధుడిగా అసాధారణ పాత్ర పోషించనున్నారు. ఈ సినిమా కథాంశం కథానాయకుడి అంధత్వ లోపం.. లవ్ ఎమోషన్ అనే ఎలిమెంట్ చుట్టూ తిరుగుతుంది. టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో తమన్నా భాటియా కీలక పాత్రధారి. నభా నటేష్ మరో కథానాయిక.