అంతర్గత ఆరోగ్యం, బాహ్య ప్రవర్తన యోగా సాధనతోనే సాధ్యం

  • జ్యోతుల శ్రీనివాసు రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ యోగభారత్ ఫౌండేషన్

రాజమండ్రి జిల్లా, రాజమండ్రి నగరం నందు జాంపేట పోలీసు కన్వెన్షన్ సెంటర్, కళ్యాణమండపం నందు ఆంద్రప్రదేశ్ యోగ భారతి పౌంఢేషన్ అధ్వర్యంలో వనమహోత్సవం, కార్తీక సమారాధన ఆత్మీయసమేళం కార్యక్రమంలో కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగ భారతి పౌంఢేషన్ కార్యవర్గసభ్యులు, కమిటీల సభ్యులు, ఆరోగ్యాభిలాషులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశం సభకు యోగ భారతి పౌంఢేషన్ యోగ గురువు అయిన యోగరత్న జ్యోతుల నాగేశ్వరరావు అధ్వర్యంలో జరిగిన సభకు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు సభకు అధ్యక్షత వహించారు. ముఖ్యాతిధిగా అన్నవరపు రామమోహనరావు, విశిష్ణాతిధిగా ప్రముఖ సినీ నటి మంజూభార్గవి, గౌరవ అతిధిగా విజయవాడ సివిల్ జడ్జి గీత అతిధిలుగా ఎం థామస్, బాపన్నగుప్త, పడాల కన్నారావు, మహారాణి, ఎస్ ఆర్ సుకుమార్, మేకల కృష్ణ, పివిఎస్ఎస్ మూర్తి, కే నాగేశ్వరరావు తదితరులు వేదికను వేదికపై ఆశీనీయులై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ ప్రతి మానవుడు కూడా తన జీవితంలో పరిపూర్ణత సాధించి”అంతర్గత ఆరోగ్యం”-“బాహ్య ప్రవర్తన” బాగుపడాలంటే యోగాసాధనతోనే సాధ్యమని సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. యోగ గురువు యోగరత్న జ్యోతుల నాగేశ్వరరావు మాట్లాడుతూ యోగసాధనను ప్రతి ఒక్కరూ కూడా తమ తమ జీవితాల్లో అంతర్భాగం చేసుకుని యోగాను ఆచరించి, తగు పరిపూర్ణారోగ్యవంతులుగా మారాలని సభనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అనంతరం ప్రముఖ సీనియాక్టరు మంజూభార్గవి, గౌరవ సివిల్ జడ్జి గీత, పడాల కన్నారావు, మహారాణి, ఎస్ ఆర్ సుకుమార్, మేకల కృష్ణ, పివిఎస్ఎస్ మూర్తి,కే నాగేశ్వరరావు సభను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం యోగభారతిపౌంఢేషన్ సభ్యుల తమ అభిప్రాయం సభకు తెలియజేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు ఏర్పాటు చేసిన వనభోజనాలు అనంతరం కేంద్రం కమిటి,రాష్ట్ర కమిటి సభ్యులకు సన్మాన కార్యక్రమం జరిగినది.అనంతరం ఎం థామస్ అత్మీయసభకు విచ్చేసిన హజరైన 200మంది యోగ భారత్ సభ్యులు అందరికి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం జాతీయ యోగభారత్ పౌండేషన్ అధ్యక్షులు అన్నవరపు రామమోహనరావు ఏర్పాటు చేసిన యోగభారతిపౌంఢేషన్ చిహ్నలు కల్గిన టీషర్టు లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ గొల్లప్రోలు అధ్యక్షులు కోసిరెడ్డి రాజా, శాఖనాగేశ్వరరావు, బోయినసత్యనారాయణ, రావుల తాతారావు, గొల్లపల్లి శ్రీను, పేకేటి వెంకటరమణ, దుర్గాడ హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్ కందా‌ శ్రీను, ఇంటి వీరబాబు, గొల్లపల్లి శివ, ఇంటి మావ్యలు, ఆకులవెంకటస్వామి మంతిన గణేష్, చేశెట్టి భద్రం, కొలా నాని, విప్పర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు.