అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

  • జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి శ్రీమతి యస్.వి.రమణ కుమారికి సత్కారం

విజయనగరం, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, మంగళవారం అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి శ్రీమతి డాక్టర్ యస్.వి.రమణ కుమారి ని సత్కరించారు. ముందుగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిస్ట్రిక్ట్ -102 గవర్నర్ మరియు డిస్ట్రిక్ట్ -102 క్యాబినెట్ సెక్రెటరీ త్యాడ చిరంజీవి రావు, శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ అధ్యక్షులు చెల్లూరి శ్రీనివాసరావు(సి.హెచ్.రమణ) చేతులమీదుగా ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ కర్రోతు సత్యం మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఓ మహిళగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారిగా జిల్లాలో చేసిన సేవలు శ్లాఘనీయమని, ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందుకెళ్ళటం మహిళా సాధికారతకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు, అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ కార్యదర్శి కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, ఉపాధ్యక్షులు లోపింటి కళ్యాణ్ పాల్గొన్నారు.