శ్రీశ్రీశ్రీ మల్లూరమ్మ తల్లి జాతరలో పాల్గొన్న రామశ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం, చిన్నమండ్యం మండలం మల్లూరు గ్రామపంచాయితీలో కొత్తపల్లి హరిజనవాడ వాస్తవ్యులు శ్రీశ్రీశ్రీ మల్లూరమ్మ తల్లి జాతర పురస్కరించుకుని అమ్మవారికి మొక్కులు చెలించుకొనుటకు చాందని బండి డప్పు వాయిద్యాలు, కోలాటం సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించిన సందర్భంగా వారి ఆహ్వానం మేరకు అక్కడి స్థానికులు, గ్రామస్థులు, మిత్రులతో కలిసి జనసేన నాయకులు రామ శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది.