కొత్తపేట జనసేన ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

  • జనసేన ప్రజాప్రతినిధులను సత్కరించిన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్.

కొత్తపేట, అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పినపల్లలో సర్పంచ్ సంగీత సుభాష్ స్వగృహంలో బుధవారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వీర మహిళలను కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. మహిళా ప్రజా ప్రతినిధులు తోట భవాని వెంకటేశ్వర్లు, తోలేటి సంతోషి, యర్రంశెట్టి మంగాయమ్మ, పడాల అమ్మిరాజు నాగలక్ష్మి లతోపాటు జనసేన వీర మహిళలు దాసర వంశి బెన్, మనిషా లను సాలువలు పూలమాలతో సత్కరించారు. జనసేన పార్టీ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వీర మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యతతో వారిని గుర్తిస్తున్నారని బండారు శ్రీనివాస్ అన్నారు. వచ్చే ఎన్నికలలో మహిళలంతా జనసేనకు మద్దతు తెలుపడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.

  • పార్టీలో చేరిన వీర మహిళలు

కొత్తపేట నియోజకవర్గ రావులపాలెం మండలానికి చెందిన మహిళలు బుధవారం జనసేన పార్టీలో చేరారు. నియోజకవర్గ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ వీరికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు పార్టీ అభివృద్ధికి అండగా నిలిచి విజయానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామని నూతనంగా పార్టీలో చేరిన దాసర వంశి బెన్, పి మనిషా చెప్పారు. పార్టీలో చేరిన వీరిని పలువురు నాయకులు అభినందించారు.

  • బండారు శ్రీనివాస్ కు ఘన సత్కారం

కొత్తపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఆలమూరు మండలం పినపళ్ళ రాష్ట్రస్థాయిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన క్రియాశీలక సభ్యత్వాల నమోదులో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిపిన కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ ను పార్టీ కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. కొత్తపేట నియోజకవర్గ ఆలమూరు మండలం పినపల్లలో జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి, సర్పంచ్ సంగీత సుభాష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బండారు శ్రీనివాస్ ను సన్మానించారు. రాష్ట్రస్థాయిలో జరిగిన పార్టీ క్రియోశీలక సభ్యత్యాల నమోదులో కొత్తపేట నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 13 వేలకు పైగా సభ్యత్వాలను నమోదు చేసి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలపడంలో విశేష కృషి చేసిన శ్రీనివాసును పలువురు అభినందించి పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు చేసిన కృషివల్లే ఈరోజు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించగలిగామన్నారు. క్రియాశీలక సభ్యత్వాలు నమోదులో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ నాయకులు సంగీత సుభాష్, బొక్క ఆదినారాయణ, దొంగ సుబ్బారావు, గారపాటి త్రిమూర్తులు, పెద్దిరెడ్డి పట్టాభి, తోట వెంకటేశ్వర్లు, సలాది జయప్రకాష్ నారాయణ, యనమదల శ్రీనివాస్, చల్లా బాబి, శిరిగినీడి పట్టాభి, కట్టా రాజు, పడాల అమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు.