అన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి అభ్యర్థులు దొరకరు: తిరుపతి జనసేన

  • వైకాపా ఇచ్చే 25 కేజీల బియ్యం కాదు, మా జనసేనాని యువతకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వనున్నారు.
  • 12న యువశక్తిని విజయ వంతం చేయండి.
  • జనసేన వారాహి యాత్రను అడ్డుకోవాలననే చీకటి జీవోలు.

తిరుపతి, వైకాపా ప్రభుత్వం పాలనలోకి వచ్చాక యువత అందకారంలో మగ్గుతున్నదని, మా జనసేనాని వైసిపి ఇచ్చే 25 కేజీల బియ్యం కాదు.. యువతకు 25 ఏళ్ల భవిష్యత్తుని ఇవ్వనున్నారని, దీనికోసం శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో జనవరి 12వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు తలపెట్టిన యువశక్తి భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని యావత్ యువత తరలిరావాలని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ కిరణ్ రాయల్, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటీ సుభాషినిలు పిలుపునిచ్చారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియాతో వీరు మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో నిరుద్యోగులు (వాలంటరీ ఉద్యోగాలు) అలాంటి వాటిని లేకపోతే బ్రాందీ షాపుల ముందు చికెన్ పకోడీలు అమ్ముకుంటూ నాశనమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోవు (2024 ఎలక్షన్స్ లో వైకాపాకు అభ్యర్థులు దొరకరని) ఎందుకంటే గడపగడపకు వైకాపా కార్యక్రమాలలో ఇప్పటికే ఫ్యాన్ పార్టీ దురాగతాలకు జనం రాళ్లతో కొట్టి తరుముతున్నారన్నారు, తమ వారాహి వాహన రిజిస్ట్రేషన్ రోజే వైసీపీకి వణుకు పుట్టిందని ఎద్దేవా చేశారు. యువత గళాన్ని వినిపించాలంటే యువశక్తికి తరలి రావాలని కోరారు గత ఎన్నికల్లో సందులో తిరుగుతూ ముద్దులు పెడుతూ ప్రజలను నమ్మించి గద్దెనెక్కాక యువత జీవితాలతో ఆడుకుంటున్న వైసీపీ ప్రభుత్వానికి ఘడియలు దగ్గరకు వచ్చాయని రానున్నది జనసేన ప్రభుత్వమేనని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు సుమన్ బాబు, ఆనంద్, మనోజ్, బాటసారి, షరీఫ్, హేమంత్, గోపి స్వామి, రాంబాబు, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.