సర్పంచుల సంఘం అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానం

విజయవాడ ఈనెల 23వ తారీకు జరిగే సర్పంచుల సంఘం అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ పార్టీలలో పెద్దలను కలిసి అఖిలపక్షానికి రావలసిందిగా విజ్ఞాపన చేస్తూ వారి మద్దతును కోరుతూ పంచాయతీ రాజ్ కమిషనర్, తాడేపల్లిలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయానికి, బిజెపి ప్రధాన కార్యాలయానికి మరియు జనసేన పార్టీ కార్యాలయానికి పెద్దలు వైవిబి రాజేంద్రప్రసాద్ మరియు సర్పంచుల సంఘం ప్రతినిధులతో వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ సర్పంచులకు రాష్ట్రంలో జరిగే అన్యాయాలను వివరిస్తూ వారికి ఆహ్వాన పత్రికను ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రంలోని సర్పంచులకు కావలసిన మినిమం హక్కులు మరియు వారి విధులు నిధులు గురించి ఒక రిప్రజెంటేషన్ తయారుచేసి ఇవ్వడం జరిగింది. వివిధ పార్టీల నాయకులు వారి వారి పరిధిలో స్పందించి తప్పకుండా వస్తామని చెప్పడం జరిగింది.