భాను ప్రకాష్ రెడ్డి బిజెపికి అధికార ప్రతినిధినా లేక టీటీడీకి అధికార ప్రతినిధినా: కిరణ్ రాయల్

  • పవన్ కళ్యాణ్ శ్రీవాణి ట్రస్ట్ పై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టడానికి భాను ప్రకాష్ మిత్రపక్షమా లేక అధికార పక్షమా..
  • శ్రీవాణి ట్రస్టులో ఏ అవినీతి జరగలేదని భాను ప్రకాష్ కు సోము వీర్రాజు చెప్పమని చెప్పారా..
  • బిజెపి భాను ప్రకాష్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలి
  • జనసేన పార్టీ డిమాండ్

తిరుపతి: గత వారం గా జనసేన పార్టీ శ్రీవాణి ట్రస్ట్ నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని టీటీడీని ప్రశ్నిస్తుంటే, తమ మిత్రపక్షం పార్టీ బిజెపి నేత భాను ప్రకాష్ రెడ్డి టీటీడీ ఈవో ధర్మ రెడ్డి, చైర్మన్ సుబ్బారెడ్డిలపై ప్రేమ పెంచుకొని శ్రీవాణి ట్రస్టులో ఎటువంటి తప్పు జరగలేదని, అవగాహన లేని వారు మాట్లాడారని, ఇది రాష్ట్ర పాలక వైసీపీని వెనకేసుకొచ్చినట్లు ఉందని హిందూ దేవాలయాలను పరీక్షించాల్సిన బాధ్యత గలిగిన బిజెపి పార్టీలో ఉండి భాను ప్రకాశ్ రెడ్డి అవినీతిని ప్రోత్సహించినట్టు ఉందని.. కావున వెంటనే భానును భాజాపా నుండి తొలగించాలని జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో రాజారెడ్డి, రాజేష్ యాదవ్, హేమ కుమార్, రాజేష్ ఆచారి, కొండా రాజమోహన్, గుట్ట నాగరాజు, హేమంత్, వినోద్, ఆదికేశవులు తదితరులతో కలిసి కిరణ్ రాయల్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా లో ముగ్గురు పాలక మంత్రులు ఉన్నారన్నారు. వీరికి జరగని దర్శన భాగ్యాలు, భాను ప్రకాష్ రెడ్డికి టీటీడీ కల్పిస్తున్నదని దీని వెనుక బాగోతం ఏమిటని ప్రశ్నించారు. జనసేన పార్టీ, టిడిపి, కాంగ్రెస్ లు శ్రీవాణి ట్రస్ట్ లో అవకతవకలు జరుగుతున్నాయని బహిరంగంగా టీటీడీని ప్రశ్నిస్తే బిజెపి భాను ప్రకాష్ రెడ్డి వీరికి అవగాహన లేదని మాట్లాడడం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులలో వాటా భాను ప్రకాష్ రెడ్డి కేనా లేక బిజెపి అధిష్టానానికి కూడా ఉందా అని ప్రశ్నించారు. టిటిడి యాజమాన్యం భాను ప్రకాష్ రెడ్డికి శ్రీవాణి ట్రస్ట్ లెక్కలను చూపించారని మీడియాకు తెలపడాన్ని తప్పు పట్టారు.న్శ్రీవారి ట్రస్ట్ లెక్కల్ని అడిగిన మాకు వివరణ ఇవ్వకుండా భాను ప్రకాష్ రెడ్డికి అకౌంట్స్ చూపించడం, ఏమిటని కోస్షన్ చేశారు. టీటీడీలో మంత్రి రోజాకి మించి భాను ప్రకాష్ రెడ్డి విఐపి దర్శనాల స్వామిగా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడన్నారు. ఈ వ్యాపారాన్ని కొనసాగించుకోవడానికే టిటిడి ఈవో, చైర్మన్ ల తరపున ప్రేమ ఒకల్తా పుచ్చుకొని శ్రీవాణి ట్రస్ట్ ను వెనకేసుకురావడం పట్ల మండిపడ్డారు. ఇలా శ్రీవారి సొమ్మును దుర్వినియోగం చేస్తే వారికి తగిన శాస్తి శ్రీవారే చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవాణి ట్రస్ట్ ను ప్రశ్నించిన తమ జనసేనానికి ట్రస్టును వెనకేసుకు వచ్చిన భాను ప్రకాష్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బిజెపి నుండి భాను ప్రకాష్ ను తొలగించాలన్నారు.