థియేటర్ కు వెళితే డేంజరా..? రాజమౌళి

ఈ నెల 15నుంచి సినిమా హాల్స్ కు 50శాతం సీటింగ్ తో నిబంధనలు అనుసరిస్తూ ధియేటర్స్ ను ఓపెన్ చేసుకోవచ్చు అని కేంద్రప్రభత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేయడం కరెక్ట్ కాదని అనుకుంటున్నానని రాజమౌళి పేర్కొన్నాడు. అన్నీ ఇండస్ట్రీలను ఓపెన్ చేసినట్లు సినీ ఇండస్ట్రీని ఓపెన్ చేస్తే సమస్య ఏమీ ఉండదు. సినిమా ఇండస్ట్రీని ప్రత్యేకంగా చూడటం వల్ల థియేటర్ కు వెళితే డేంజరా..? అనే ఆలోచన జనాలకు వస్తుంది.

ఇక ”50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేయడం కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. ఫ్లైట్స్ లో రెండు మూడు గంటలు ప్రయాణిస్తున్నారు. దానితో పోల్చితే థియేటర్స్ లో సీట్ల మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటుంది. మరి అలాంటప్పుడు యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేయడం కరెక్ట్ కాదేమోనని అనుకుంటున్నాను అని అన్నారు . అలాగే ఎక్కడపడితే అక్కడ మాస్కులు ధరించకుండా తిరిగినప్పుడు లేని ప్రమాదం సినిమా థియేటర్ కు వెళ్లినప్పుడు వస్తుందని నేను అనుకోవడం లేదు. అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.