పోలీస్ యాక్ట్ 30 జనసేన పార్టీకి మాత్రమేనా..?: శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గం: ఇళ్ళ నిర్మాణాల్లో అవకతవకలు ఉంటే నిరూపించాలని పవన్ కళ్యాణ్ కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఛాలెంజ్ ను స్వీకరించి జగనన్న ఇళ్లలో మోసాన్ని నిరూపిస్తామని ఆదివారం చర్చకు సిద్ధం అన్న శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా. ఈ సందర్బంగా శ్రీమతి వినుత మాట్లాడుతూ దమ్ముగా ఛాలెంజ్ ను ఎదుర్కోలేక శ్రీకాళహస్తి ఎమ్మెల్యే దొడ్డి దారిన పోలీసులను అడ్డు పెట్టుకుని జనసేన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా ను, నాయకులను, జనసైనికులను ఛాలెంజ్ కి రాకుండా ఆపాలని ప్రయత్నించడం ఎమ్మెల్యే అసమర్థకు, అధైర్యానికి నిదర్శనం. ఛాలెంజ్ ఎదుర్కోవడానికి దమ్ము, ధైర్యం లేనప్పుడు ఛాలెంజ్ విసరడం ఎందుకు!!.. శ్రీకాళహస్తి లో సెక్షన్ 30 యాక్ట్ అమలులో 14-నవంబెర్ నుండి ఉందని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు, 3 రోజుల క్రితం ఎమ్మెల్యే ఆద్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలో 3 రాజధానులు మద్దతుగా బారీ రాలీ నిర్వహించినప్పుడు 30 ఆక్ట్ ఎందుకు వర్తించలేదని ప్రశ్నిస్తున్నాం. జనసేన పార్టీ కి మాత్రమేనా 30 ఆక్ట్!! ఛాలెంజ్ విసిరిన వాళ్ళు బహిరంగ చర్చకు వచ్చేట్టు ఉంటేనే జనసేన కు ఛాలెంజ్ విసరాలని, లేనపుడు ఎందుకు ఈ పసలేని ఛాలెంజ్ లని ప్రశ్నిస్తున్నాం. జనసేన అంటే భయం లేదు అంటూనే శ్రీకాళహస్తి పట్టణం మొత్తం పోలీసులతో నింపేసి, మా ఇంటి వద్ద 70 మంది పోలీసులను పెట్టడంలోనే తెలుస్తోంది. ఎక్కడికక్కడ నాలుగు మండలాల జనసేన నాయకులను గృహ నిర్భంధం చేసి, శ్రీకాళహస్తి పట్టణంకి వస్తున్న జనసైనికులను ఎక్కడికక్కడ వెనక్కి పంపడాన్ని ఖండిస్తున్నాం. పోలీసులు 30 ఆక్ట్ ను దుర్వినియోగం చెయ్యడానికి గౌరవ హై కోర్ట్ దృష్టికి తీసుకుని వెళ్తాం. విధాన పరమైన అంశాలపై మాట్లాడితే ఊరుకుంటామ్ కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే దానికి ధీటుగా సమాధానం చెప్తామని అన్నారు. జనసేన పార్టీ మాట్లాడే ప్రతి మాటకి ఆధారాలు ఉంటేనే ఆరోపణలు చేస్తాము తప్ప, ఉత్తుత్తి ఆరోపణలు, సవాళ్లు చెయ్యమని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు అన్ని గమనిస్తున్నారు 2024 ఎన్నికల్లో తప్పక బుద్ది చెప్తారని తెలిపారు.