తిరుమలలో భద్రతా లోపం అధికారుల నిర్లక్ష్యమా లేక రాజకీయ నాయకుల ప్రోద్బలమా..?

  • పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల దేవస్థానంలో మత్తు పదార్థాలను అరికట్టాలి – రాజారెడ్డి

తిరుమలలో ఇదివరకు మద్యం, మాంసం తరలిస్తున్న విషయం విధితమే ఇప్పుడు కొత్తగా గంజాయిని కూడా తరలిస్తున్నారు. దీనికి కారణం భద్రతా లోపమా అధికారులు రాజకీయ నాయకుల ప్రోత్సాహమా ఈ గంజాయి తరలింపు వెనుక ఎవరెవరి హస్తముంది, ఎవరికి వాటాలు వెళుతున్నాయి అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం అలిపిరి వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, రాజేష్ యాదవ్ హేమ కుమార్, రాజేష్ ఆచారి, కొండ రాజమోహన్, మునస్వామి, ఆకేపాటి సుభాషిని, కీర్తన, డా.బాబు, లక్ష్మి, కోకిల, మనోజ్, వినోద్, విశ్వ, రమేష్, సాయి దేవ్, కిరణ్, పురుషోత్తం, కాకర్ల హేమంత్, బాలాజీ, వెంకటేష్ రాయల్, లోహిత్ రాయల్, ధనుష్ రాయల్, రమేష్, మరియు జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.