స్మగ్లర్లకు ఉన్న విలువ కూడా కాపులకు లేదా జగనన్నా?

  • చిత్తూరు నియోజకవర్గంలో జగన్ జైలు మేట్ కు సీటు
  • ఎమ్మెల్యే శ్రీనివాసులు చేసిన ఆరోపణలపై – కిరణ్ ఫైర్

తిరుపతి: చిత్తూరు నియోజకవర్గానికి తనతో పాటు జైలులో గడిపిన విజయానంద రెడ్డికి ఆ పార్టీ టికెట్ కేటాయించడంపై తిరుపతి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కిరణ్ రాయల్ విమర్శలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ శనివారం ఉదయం జరిగిన విలేకరి సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయానంద రెడ్డి నాలుగు సంవత్సరాల క్రితం ఏమాత్రం ఆర్థిక బలం లేని ఒక సామాన్యుడని ప్రస్తుతం ఆర్టీసీ చైర్మన్ గా కొనసాగుతూ ఎర్ర బస్సుల ద్వారా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసి వందలాది కోట్లు రూపాయలు అక్రమంగా సంపాదించారని అన్నారు. విజయానంద రెడ్డిని చూస్తే అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గుర్తుకొస్తున్నారని కిరణ్ వాపోయారు. చిత్తూరులోని బలిజ కాపు కులస్తులైన జంగాల శ్రీనివాసులకు రాజ్యసభ సీటు ఆశ చూపి ఆ సీటును రెడ్లకు కేటాయించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే శ్రీనివాసులు చేసిన ఆరోపణలపై కిరణ్ మండిపడ్డారు. వందల కోట్లు ఉన్న అంబానీ, ఆదోని లాంటివరికే జగన్ రాజ్యసభ సీటు ఇస్తారని, మీకు చెప్పిన మాటలు కేవలం బిస్కెట్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డికి బలిజ కాపు కులస్తులపై ఏమాత్రం జాలి, దయ, అభిమానం లేదని విమర్శించారు. గతంలో రాయలసీమలో 52 నియోజకవర్గాలకుగాను ఒక్క చిత్తూరు మాత్రం బలిజ కులుస్తుడను నియమించారని ఇప్పుడు ఆ ఒక్కరిని కూడా తప్పించి విజయానంద రెడ్డికి సీటు ఇచ్చారని, నియోజకవర్గంలో నామాత్రపు సేవా కార్యక్రమాలు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్లకు లక్షలు ఖర్చుపెట్టి ఘనంగా జన్మదిన వేడుకలు మాత్రమే ఆయన చేశారన్నారు. పోలీస్ స్టేషన్లో 47 కు పైగా విజయానంద రెడ్డి పై రౌడీషీట్, స్మగ్లింగ్, క్రిమినల్, పిడియాక్ట్ కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. అటువంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తికి సీట్ ఇవ్వడం ఫై కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు బలిజ సామాజిక వర్గం పై జగన్ కు ఏ మాత్రం అభిమానులేధన్నారు. ఈ విలేకరి సమావేశంలో జనసేన పార్టీ నాయకులు రాజమోహన్, సుమన్ బాబు, హిమవంత్, నాగరాజు, వంశీ, రాజేంద్ర, సురేష్ లు పాల్గొన్నారు.