మహేష్ సినిమాలో సూపర్ ఛాన్స్ దక్కించుకున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి..

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది అందాల భామ నిధి అగర్వాల్. అంతకు ముందు ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అందాల తార. రెండో సినిమాతోనే అక్కినేని హీరోతో ఆడిపాడిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఇక రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఈస్మార్ట్ శంకర్’తో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. తాజాగా ఈ అమ్మడు కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళుతోంది. అంతేకాకుండా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసిందని ఇటీవల వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిలిం నగర్ లో గట్టిగా వినిపిస్తుంది.

త్వరలో ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో జతకట్టనుందట. మహెష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వలో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీబిజీ గా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నా సమయంలో కరోనా కారణంగా చిన్న బ్రేక్ ఇచ్చారు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను పరిశీలిస్తున్నారట. అయితే ముందుగా మహేశ్ బాబు సినిమా కోసం కూడా పూజా హెగ్డేనే తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు నిధి పేరు తెరపైకి వచ్చింది. అయితే మహేష్ సినిమా నిధి మెయిన్ రోల్ లో కనిపిస్తుందా లేక సెకండ్ హీరోయిన్ గా కనువిందు చేస్తుందా అన్నది చూడాలి.