వైద్యారోగ్య శాఖకు సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. అన్ని ఆస్పత్రుల్లో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించాలని తెలిపారు. అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. గాంధీ, టిమ్స్‌ వంటి చోట్ల అగ్నిమాపక యంత్రాలు సిద్ధంగా ఉంచాలని ఆయన ఆదేశించారు.

”ఆక్సిజన్‌ను యుద్ధ విమానాల ద్వారా తీసుకువస్తున్నాం. అవసరమున్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఆక్సిజన్‌ చేరాలి. ఆక్సిజన్‌ అవసరమైన ఆస్పత్రులకు చేరేలా సమన్వయం చేసుకోవాలి. కరోనా నిర్ధరణ పరీక్షల కిట్లకు కొరత ఏర్పడకుండా చూడాలి. లభ్యత ఉన్న దేశాల నుంచి కరోనా కిట్లు దిగుమతి చేసుకోవాలి. కరోనా కిట్లు వాయు మార్గంలో తరలించేలా చర్యలు తీసుకోవాలి. కరోనా లక్షణాలు ఉన్నవారికి వెంటనే హోం ఐసోలేషన్‌ కిట్లు ఇవ్వాలి”అని కేసీఆర్‌ ఆదేశించారు.