సొరంగం నుంచి కూలీలు క్షేమంగా బయటపడటం సంతోషదాయకం

ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తర కాశీలో సిల్ క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కూలీలు ఈ రోజు క్షేమంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకోగలిగాం అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ కష్ట జీవులు క్షేమంగా బయటకు రావాలని వారి కుటుంబ సభ్యులే కాదు… ఎందరో ప్రార్థనలు చేశారు. 41 మందీ క్షేమంగా రావడం సంతోషదాయకం. వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు, నిపుణులు 17 రోజులపాటు ఎంతో శ్రమ తీసుకున్నారు. ర్యాట్ హోల్ మైనింగ్ కార్మికులు దిగ్విజయంగా తమకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఓ వైపు సహాయక చర్యలకు పలు మార్గాలు అన్వేషిస్తూనే సొరంగంలో చిక్కుకున్నవారికీ, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలమయ్యాయి. వారికి నా అభినందనలు అని జనసేనాని పేర్కొన్నారు.