ఫ్రై డే–డ్రై డే అని చెప్తే సరిపోదు, ఆచరణలో పెట్టాలి

  • జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రారంభించిన జనం కోసం జనసేన మహాయజ్ఞం కార్యక్రమంలో గండేపల్లి మండల ఉప్పలపాడు గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించిన జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో చాలా చోట్ల డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ప్రజలు రోడ్డు మీద కాలు పెట్టడానికే భయపడుతున్నారు అని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా రోడ్లపై పేరుకుపోయిన చెత్త పైన దోమల సంచారం పెరిగి చుట్టు ప్రక్కల ప్రజలంతా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి రకరకాల జ్వరాలతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారన్నారు. ప్రభుత్వ అధికారులు ఫ్రై డే–డ్రై డే అని ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టేసి ఊరుకుంటే సరిపోదని దాన్ని ఆచరణలో ఉంచి ప్రతి వారం కూడా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేని ప్రదేశాలలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయిస్తూ ఉండాలని సూచించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే నియోజకవర్గంలోనీ ప్రతి గ్రామంలో కూడా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మించి ఎక్కడ కూడా మురికి నీరు, చెత్త నిల్వ లేకుండా పరిసరాలు మొత్తం పరిశుభ్రంగా ఉండేలా చేయడానికి కృషి చేస్తామని అన్నారు.