జనసేన నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదు.. రేగిడి లక్ష్మణరావు

విజయనగరం: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధనకార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి పై మరియు మరికొంతమంది జనసైనుకుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర దళితసత్తా అధ్యక్షుడు రేగిడి లక్ష్మణరావు బుధవారం విజయనగరం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా నివాసముంటున్న బొగ్గుల దిబ్బలో ప్రజలను ఉన్నపళంగా రొడ్డుకీడ్చడాన్ని ఖండిస్తూ.. ప్రజల పక్షాన నిలిచిన జనసేన పార్టీ నాయకురాలు యశస్వి పై అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దారుణమని, దీన్ని ప్రభుత్వం అధికార పార్టీ నాయకుల నిరంకుశత్వానికి నిదర్శనమని, మీ తాటాకు చప్పుళ్లకు జనసేన బెదిరేదీ లేదని, ప్రజల పక్షాన జనసేన అహర్నిసలు పోరాడుతుందని, ప్రజలంతా వైసీపీ ప్రభుత్వం అరాచకాలను గమమనిస్తుందని, సరియైన సమయంలో సరియైన గుణపాఠం ప్రజలంతా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో దళిత, గిరిజన మహిళలకు తీవ్రమైన దాడులు, అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు జరిగినప్పుడు ఏమయ్యాయి ఈ కేసులు, ఈ చట్టాలని, ప్రభుత్వాన్ని నిలదీశారు. పార్టీ ప్రతినిధి, మహిళ అనికూడా చూడకుండా పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించారని, ప్రజాస్వామ్యంలో హక్కులను కాలరాస్తున్నారని, అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ పెట్టిన కేసును వెనక్కు తీసుకోవాలని కోరారు.