ఓటరుగా నమోదు కావడం మన బాధ్యత!

  • ఓటు అనే వజ్రాయుధంతో మంచి పాలకుల్ని ఎన్నుకోవచ్చు
  • రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును వినియోగించుకోవాలి
  • దేశ భవిష్యత్తు మార్చే సత్తా యువత చేతి ఓటులోనే ఉంది
  • ఓటు నమోదు పై భాస్కర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: ఓటరుగా నమోదు కావటం 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్క యువతి యువకులు బాధ్యతగా తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు అన్నారు. గురువారం పార్వతీపురం పట్టణంలోని భాస్కర్ కళాశాలలో విద్యార్థులకు జనసేన పార్టీ నాయకులు మండల అధ్యక్షురాలు అగూరు మణి, గుంట్రెడ్డి గౌరీశంకర్, చిట్లు గణేశ్వరావు, అన్నా బత్తుల దుర్గాప్రసాద్, అంబటి బలరాం, బొండపల్లి జనార్దన్ రావు, తామరకండి తేజ, తదితరులు ఓటు నమోదు పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ విధిగా పొందాలన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనే వజ్రాయుధంతో నీతి, నిజాయితీ, విలువలతో కూడిన నాయకుల్ని ఎన్నుకోవచ్చు అన్నారు. గ్రామం, పంచాయతీ, మండలం, జిల్లా, రాష్ట్ర, దేశ భవిష్యత్తు మార్చే సత్తా యువత చేతి ఓటు లోనే ఉందన్నారు. కాబట్టి 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతీ యువతి యువకులు ఓటుగా నమోదు కావాలన్నారు. ఓటు నమోదు కార్యక్రమం పై ఎన్నికల కమిషన్ డిసెంబర్ 2,3 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తోందన్నారు. బి ఎల్ ఓ నుండి తాసిల్దార్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఓటు నమోదు కార్యక్రమం పై సేవలు అందిస్తున్నాయన్నారు. అలాగే కళాశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమాలను కూడా చేపడుతున్నారన్నారు. దీనికోసం ఆధార్, పదో తరగతి జిరాక్స్ కాపీలతోపాటు రెండు ఫోటోలు తల్లి లేదా తండ్రి ఓటు కార్డు జిరాక్స్ కాపీ తదితర పత్రాలను ఫారం 6తో జతచేసి ఓటు నమోదు చేసుకోవాలన్నారు. అలాగే ఆన్లైన్లో కూడా ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు. కాబట్టి 18 ఏళ్ల నిండిన ప్రతీ యువతీ యువకులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.