ఉత్తమ సేవా పురస్కార్ అందుకొన్న ఆర్.కె

గుడివాడ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుడివాడ పట్టణంలో జనసేన కార్యకర్త ఆర్.కె చేస్తున్న సేవా కార్యక్రమాలు, సేవలను గుర్తించి కృష్ణాజిల్లా కలెక్టర్ రంజిత్ భాష మరియు జిల్లా ఎస్పీ జాషువా చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కార్ ప్రశంసా పత్రం అందజేసి అభినందనలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్.కె మాట్లాడుతూ ఈ సేవా స్ఫూర్తి నేర్పిన పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక కార్యకర్తను అవ్వడం చాలా గర్వంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేసారు.